పుట:SamskrutaNayamulu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
151

సంస్కృతన్యాయములు

లాభాధిక్యమును నిరసించి స్వల్పలాభమునిచ్చు పనులలో బ్రవర్తించుట.

మత్తకాశినీన్యాయమువలె.

షష్ఠాద్యన్యాయము

ఆఱుగురిలో మొదటివాడు అన్నట్లు.

ఒకచో నాఱుగురు మనుష్యులున్న వారిలో మొదటివాడెవడో తెలిసికొనుట దుర్ఘము. వారిలో నెవనినుండి లెక్కించుట ప్రారంభించిన నాతడే మొదటివాడవును. అదేలక్కయందు అనులోమవిలోమముగ మొదటివాడాఱవువాడను, ఆఱవవాడు మొదటివాడును కావచ్చును. కాని అభిమతుడుమాత్రము తెలియబడడు. అట్లు మొదటివాడు తేలవలెననిన ఫలానా ఫలానా ఆఱుగురిలో మొదటివాడు అని నిర్ధారణచేసి చెప్పవలను.

అనిర్ధారిత విషయములం దీన్యాయము ప్రవర్తించును. ఆచెట్టుమీది పక్షులలో మొదటిది చాలా అందమైనది అన్నట్లు.

షాష్ఠతిర్వగధికరణన్యాయము

మెలికలుపెట్తిన సిద్ధాంతముమాదిరి.

షోడశికాగ్రహణాగ్రహన్యాయము

షోడాశిని గ్రహించుట, గ్రహింపకుండుట వలె.