పుట:SamskrutaNayamulu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
145

సంస్కృతన్యాయములు

మూలప్రకృతి వాస్తవమున నొకటియయ్యు జగదాద్యాకృతులం బరిణమించి యనేకత్వమున భాసించును.

శ్మశానకుసుమన్యాయము

వల్లకాటిలో మంచిమంచిపూరులు పూచినట్లు నిష్ప్రయోజన మని భావము

శ్మశానావైరగ్యన్యాయము

శవమును కాటికిజేర్చి అగ్నిసంస్కారముచేయుచు, అటనున్నంతదనుక "ఏమున్నది? అంతా మాయ. ఈదేహము ఋణానుబందము. భార్యాపుత్రాదులు శత్రువులు" అని వైరాగ్యముతో పలుపోకలు పోదురు. మఱలివచ్చినంతన దూడపేడాదగ్గఱనుండియు తనకే కావలెను.

పురాణ, ప్రసూతి వైరగ్యములటులు

శ్యామరక్తన్యాయము

వస్త్రమునకు శ్యామలవర్ణము పోయిన నెఱుపురంగు వచ్చును. కాని రంగు లేకుండమాత్రము వస్త్రముండదు. ప్రతియొకవస్తువు గుణసహితమై యుండునుగాని గుణరహితమై యుండదు.

అట్లే--నిర్గుణపరబ్రహ్మము నామరూపక్రియావికార రహితమైనను నామరూపక్రియారహితత్వవికారసహితమేయై యొప్పుచుండును. (ఆభావమందు ఆభావత్వభావమిమిడియున్నట్లు)