పుట:SamskrutaNayamulu.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
146

సంస్కృతన్యాయములు

శ్యాలశునకన్యాయము

ఒకదు తనభార్యకు కోపము గలిగించి ఏడిపించుటకై తన పెంపుడుకుక్కను బావా, బావా అని పిలుచుచుండును. ఒకనాడతడు కుక్కను చామమోది బావా అని పిలుచుచు, బండబూతులు తిట్టెను. అందుల కాతనిభార్య సహించలేక నిజముగా ఆకుక్క, తనతమ్ముడే అనుల్ నూహతో ఏడ్చి భత్రతో తగువులాడేనట.

తనకు సంబంధంచనివస్తువుపై మమత్వబుద్ధినిచ్చి ఆవస్తువుకేదేని హాని సంభవించినపుడు దు:ఖించుట లోకస్వభావము.

శ్వేనకపోతీయన్యాయము

పావురము డేగబారిన బడినట్లు.

"యధా కపోతోతర్కత మాగతేనె శ్వేతేనగృహీత స్తధాన్ కస్మికో యోదుర్యోగ స్స ఏవ ముచ్యతే:" గింజ లేక తినుటకై కళ్ళమునకు బోయిన పావుర మొకడాస్మికముగ నగుచెంచిన డేగవాతంబడి మడిసెను.

అట్లే--- తలవనితలపుగ సంభవించిన దుర్యోగమునెడ నీన్యాయ ముపయోగింపబడును.

శరపురుషీయ, కాకతాళీయ న్యాయములను జూడుము.

శ్వేనాధికరణన్యాయము

పావురవములు కొంగలు మున్నగువానిపై డేగ కధికారమిచ్చినట్టు.