పుట:SamskrutaNayamulu.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
144

సంస్కృతన్యాయములు

ఈఆవులమందలో నాఆవు ఏది అని యజమాని అడిగిన గోపాలుడు ఇది నీయావు అని దానికొమ్ములు పట్టుకొని చూపినట్లు.

"--ఏవంబోధకం శాస్త్రం విధాయకం " ఇట్లు ప్రధాన లక్షణోదాహృతిపూర్వకముగ నుడుపునది. విధాయక శాస్త్రము.

శృంగగ్రాహదిలక్షణములచే వస్తునిర్ధేశము చేయుట అని తాత్పర్యము.

మఱియు---

"యధా గోమండలస్థానం గాం శృంగం గృహీత్వావిశేషతో దర్శయత్యేషా బహుక్షీరేతి".

మందలోనొక యావును కొమ్ములు పట్టుకొని చూపుచు అలకాపరి యీయావు చాలా పాలిచ్చును అని చెప్పునట్లు.

మఱొకయుదాహరణము--

గవాదులు సాక్షాచ్చృంగగ్రాహికచే నిర్ధేశింపబడి తెలిసి కొనబడినట్లు బ్రహ్క విధాయకశాస్త్రమున ప్రతిపాదితమును, ప్రతీరమును గాదు.

శైలూషీన్యాయము

నాటకములో వేషము వేయు స్త్రీ అనేకవేషములు వేసి తా నొకతేయే అనేకరూపములతో భాసించును.