పుట:SamskrutaNayamulu.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
143

సంస్కృతన్యాయములు

శుష్కతటాకమత్స్యన్యాయము

ఎండిపోయిన చెఱవులోని చేపలట్లు.

శుష్కేష్టిన్యాయము

శుష్కేష్టి యన భ్రష్టక్రతువు ఉత్తరకాలమున క్రతుకృతులయందు ప్రావీణ్యము ప్రతిష్ట సంపాదించు నుత్సుకతతో అవిధిపూర్వముగ నొనత్పబడు నిష్టి శుష్కేష్టి అనబడును. ఈన్యాయము చాలవఱకు భూమిరధిక న్యాయమునకు సరివచ్చును. భూరధికుని యుద్ధక్రియతాత్కాలికముగ ప్రయోజనశూన్యమయ్యు అభ్యాసవశమున సంగ్రామరంగముల నధికచాతుత్యము నిచ్చి పేరు ప్రతిష్టలు సంపాదింప మూలకారణ మవును.

శూర్పన్యాయము

చేట మంటిబెడ్డలు, తవుడు, ఊక మున్నగువానిని వద;ఒవఒచొ బియ్యమును నిలువచేయును.

బుద్ధిమంతులు దుర్గుణములను వదలివైచి సుగుణములను మాత్రమే స్వీకరింతురు.

శృంగగ్రాహికాన్యాయము

శృంగస్యగ్రహణం క్రియ్హాయాంయస్యాం సాశృంగగ్రాహికా కొమ్ములుపట్టుకొను పని.

"యధా గోవ్రజే కామదీయా గౌ రితి గోప: పృష్టు: శృంగం గృహీత్వా గాం ప్రదర్శయేత్--"