పుట:SamskrutaNayamulu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
142

సంస్కృతన్యాయములు

అట్లే--- పైకి చాల సుఖముగ కనబడినను కామము మానవునధోగతి పొందించును.

ఇదియే నీలకంఠాచార్యులవారు భార తొద్యోగపర్వమున--"కాకుదీకం శుకం నాక మక్షిసంతర్జనం తధా..... అను శ్లోకవ్యఖ్యానమున నిట్లుపదేశించియున్నారు---

"కాకుదీకమిత్యాదయోzష్టాస్త్రవిశేషాజ.... యేవ శుక నిలికాన్యాయేన అభయేపి భయదర్శినో హయరధాది పాదేషు గాడం శ్లిష్యన్తి తుచ్చకమోహనణ నామ||"

మఱియొక యుదాహరము--శుకనలికన్యాయముచేస్వరాకామ పరికల్పితమేకాని ఆత్మకు వాస్తవముగ సర్తృత్వము, బంధమోక్షాదికములేదు.

శుక్త్యంబుబిందున్యాయము

ముత్య్హములో బడిన వానబొట్తు ముత్యమయినట్లు, "చిప్పబడ్డ నీటిచినుకు ముత్యంబాయె" వేమన

సత్పురుషునుయందు గావింపబడిన జ్ఞానోపదేశము బ్రఖ సాధకమై రాణించును.

శుద్ధోదలవణన్యాయము

మంచినీరు, ఉప్పు భిన్నములైనట్లు చొరాఫార్య, నదీసముద్ర, శకునిసూత్ర, పుంవిషయ, నానావృక్షరసన్యాయములను జూడుము.