పుట:SamskrutaNayamulu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తొలిపలుకు

రత్నాకరమువలె నతిగంభీరమైన గీర్వాణభాషయందు సుందరతరములవు శ్లోకములను సరముల గొలికిపూస లన జను న్యాయము లెన్ని యున్నవో యెరింగికొనుట కడుంగడు దుర్ఘటము. అవ్వానివిలువ విజ్ఞఉలకుమాత్రమే విదితము.

కొందరు సుమనసు లతి శ్రమ కోర్చి చాలవరకు న్యాయములను తగు వ్యాఖ్యానములతో బ్రకటించి దేశోపకార మొనరించియుండిరి. అందగ్రస్థానము వహింపగల గ్రంథములును లేకపోలేదు. అట్టివి చాలవరకు సంస్కృతాది భాషలలో నున్నవి. వానియందును న్యాయజాల మంతయు సమగ్రముగ నున్నట్లు కన్పట్టదు. తత్కృతికర్తలు తామిడుకొనిన సరణి కనువవువానిని మాత్రము గ్రహించియుండిరి.

ఎన్నియో సంవత్సరములనుండి లౌకిక, వైదిక న్యాయము లొకచో గూర్చి తగువ్యాఖ్యానములతో నాంధ్రమున సహృదయులమ్రోల నిడవలయు ననుకుతూహలమున దత్ప్రయత్న మొనర్చుచుంటిమి. ఈ యుద్యమమున మాకు దోడ్పడినమామిత్రులు మధురకవులు శ్రీ నాళం కృష్ణరావుగారి కెంతయు గృతజ్ఞఉలము.

దైవానుగ్రహమున నేటికి మాప్రయత్న మొకింత ఫలించినది. తప్పొప్పు లటుండ నిండు, పుస్తకరూపముగ సుమారు పండ్రెండువందలు న్యాయకుసుమములు పాఠక మహాశయుల కరములయం దిడుచున్నాము. ఇయ్యది రెండు భాగములు. మొదటిభాగమున వైదిక, లౌకిక న్యాయములు