పుట:SamskrutaNayamulu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆధునికకవులు, శ్రీ టేకుమళ్ల కామేశ్వరరావుగారు బి.ఏ., బి.యిడి. (Deputy Inspector of schools) నా యందభిమానముంచి, కొన్ని సామెతలు, జాతీయములు నిచ్చియుండిరి. వీ రిరువురకు నా కృతజ్ఞతాపూర్వక నమస్కారములు.

ప్రప్రథమమున "లోకోక్తిముక్తావళి" యను పేరుతో తెలుగు సామెతలు ప్రకటింతుమని వెల్లడిజేసితిని. కాని పండితులు "సంస్కృతన్యాయములు" ప్రకటించవలసినదని నుడువగా నీయది ప్రకటించితిని. అచిరకాలమున తెలుగు జాతీయములు, సామెతలు ప్రకటింపబడును.

నాయం దాదరభావము వహించి సంస్కృతన్యాయములు, జాతీయములు, సామెతలు కూర్చి వ్యాఖ్యానములు వ్రాసి యిచ్చుచుండిన, శ్రీ కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, వారి సొదరులు ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రిగార్లకు నా ధన్యవాదములు.

ఆంధ్రమహాశయు లెల్లరు మా గ్రంథమండలియం దాదరభావము వహించి, చందాదారులుగా జేరి ప్రోత్సహింప బ్రార్థితులు.

లక్ష్మీగ్రంథమండలి, విధేయుడు,

తెనాలి. పి. యల్. నారాయణ.

24-11-39 సంపాదకుడు.