పుట:SamskrutaNayamulu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గూర్పఁబడినవి. వేదాంతవ్యాకరణాది పరిభాషలనుండియు, లోకోక్తులనుండియు వెలువడినవియు, కేవలము పరిభాషా స్వరూపముగనే యుండునవియు, నవున్యాయములు ద్వితీయ భాగముగ గూర్చితిమి. అట్ళు విడివిడిగ నుండు టాయా విషయముల గృషిసేయువారల కెంతయు లాభము గలిగించునని మా యాశయము. మొత్తము రెండు భాగములును గలిపి యొకే సంపుటముగఁ జేసితిమి.

ప్రయత్నము మాత్రము చాలకాలమునుండి జరుగుచున్నను, ముద్రణముమాత్రమ వ్యవధిగ జరుగుటచే వ్రాతప్రతిని తిరిగి సరిగ వ్రాయకయే ముద్రింపించితిమి. అందు వలన ప్రమాదము లటనట సంభవించినవి. అవన్నియు త్వరలో రానున్న ద్వితీయముద్రణమున సవరించువారము.

శ్రమయన కందందు సోదాహరణముగ న్యాయచయ స్వరూపప్రయోగములను వివరించిన మహనీయుల కెంతయు గృతజ్ఞఉలము.

ప్రమాదవశమున సంభవించిన ప్రమాదములను, మా సాహసమును బుధులు మన్నింతురుగాక.

మాయం దనుగ్రహముంచి, తమ యభిప్రాయముల నొసంగిన మహాపురుషులకు మా ధన్యవాదములు.

ఆదరమున మా పుస్తకమును బ్రకటింప బూనుకొనిన లక్ష్మీగ్రంథమండలి వారెంతయు బ్రశంసనీయులు.


కొల్లూరు విధేయులు,

                                         శాస్త్రి సోదరులు
                                          వ్యాఖ్యాతలు.