పుట:SamskrutaNayamulu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
121

సంస్కృతన్యాయములు

అపాయకరమైనను విషయమును కొంచెము కొంచెముగ తినుట అలవాటుచేసికొనిన క్రమముగ అదే పరిపాటియై తుదకు విషమే తిని ప్రాణధారణము జేయ కారణ మవును.

అట్లే-దుర్మార్గాచరణమును తొలుత కొంచెముకొంచెముగ నారంభించిన పరిపాటియై తుద కదియే తన వృత్తిగ మాఱును.

విషయసూచికాన్యాయము

విషయసూచికను జూచియే గ్రంధమందలి యంశముల నెఱింగికొనినవిధమున.

ముఖముము చూచియే కలపరిస్థితుల గుర్తించు మచ్చున చెప్పకయే తనంత తా స్పష్టమవుపట్ల నీన్యాయప్రవృత్తి కలుగును.

విషవృక్షన్యాయము

విషపుచెట్టునువలె.

"విషవృక్షో z పిసంవర్ధ్య స్వయం చేత్తు మసాంప్రతమ్" కుమారసంభవము

విషవృక్ష మయినను స్వయముగ పెంచి తనచేతులార నఱికి వేయ యోగ్యము కాదు.

ఉదార-తర్కికమతమున--

"ఏతేసర్వే తర్కా...... అస్మాభి రేవ తర, పర పర్య మబివ్షిక్తా స్తతో న ప్రబన్ధెన నిరస్యస్త "విషవృక్షో సి సంవర్ధ్య స్వయం ఛేత్తు మసాంవ్రతమ్"