పుట:SamskrutaNayamulu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
122

సంస్కృతన్యాయములు

ఈతర్కము లన్నియు మాచేతనే తర్కపదవియందుజొప్పింపబడినవి. కాన (మాచేతనే) ప్రబన్ధమున నిరసింప బడవు. స్యయంసంవృద్ధమయిన విషవృక్షము సయితము తనకుయ్ నఱుక నయోగ్యముగదా!

అట్లే--దుర్మార్గు డయ్యును కన్నకొడుకు తండ్రి కవధ్యుడు.

ఇదియే మఱొకచో---

"హాహామయేదం నో చారుకృతం యత్సుతభర్క్సనం, విషవృక్షోzపి సంవర్ధ్య స్వయం ఛేత్తు మసాంవ్రతమ్" అని చెప్పబడి యున్నది.

విహగన్యాయము

పక్షి సూటిగ చెట్టుపై కెగిరినట్టు.

చెట్టుపైనున్న ఫలము ననుభవింపవలెననిన పక్షి వెంటనే సూటిగా నెగిరి పండుదగ్గరకు జేరి యాపండు తినును.

అట్లే--పూర్వ్ఫజన్మకృతకర్మఫలమును జీవుడు వెంటనే అందుకొని అనుభవించును.

విహంగన్యాయ మనియు, విహంగమన్యాయ మనియు గూడ దీనికి బేర్లు.

వీచితరంగన్యాయము

వాయవశమున సముద్రమందు మొదట చిన్నచిన్న తరంగములు పుట్టి క్రమక్రమముగ అని కలియుచు పెద్దవై తురకు పెద్దపెద్ద కెరటములుగా తయారయినట్లు.