పుట:SamskrutaNayamulu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
120

సంస్కృతన్యాయములు

"పోనీ, దాత ఎవడో వినిపింతువా?"

"చాకివాడు. అతడొకడే ఈయూర మహాదాత. ఎందువలన నందువా? ఉదయము తీసికొనిపోయిన గుడ్డలను రాత్రికి మఱల తెచ్చియిచ్చుచున్నాడు."

"అయిన నీయూరిలో నెట్లు జీవించుచున్నావౌయి? '

"అయ్యా! ఏమిచెప్పను? విషకృమిన్యాయముగా జీవించుచున్నాను. అనగా యీయూర బుట్టినవాడ నగుటఛే నిచటిప్రకృతి కలవాటుపడి బ్రదుకుచున్నాను అని భావము.

విషములోనిపురుపునకు విష మిష్టాహారమే, ఆవిషయము దాని కేమియు హాని చేయదు; కాని, యితరులకుమాత్రము హానికర్ వవును.

"What is one man's food is another man's poison".

"ఒకనికి ఆహార మయిన వస్తువు మఱోకనికి విషమవును." ఒకరికిమేలు మఱొకరికి కీడు.

పై విషకీటన్యాము, ఈ విషకృమిన్యాయము రెండు నొకటియే.

విషభక్షన్యాయము

విషమును తిని జీర్ణించునట్లు.