పుట:SamskrutaNayamulu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
100

సంస్కృతన్యాయములు

ఇత్యాది శ్రుతేః పూర్వోక్తానభిజ్ఞతయానాత్మాన మేవాత్మతయా జానీతే గురుశాస్త్రోపదేశే నాత్మని జ్ఞాతే తదాత్మబుద్ధి మపదవతి||"

ఒక పల్లెటూరివాఁడు 'గవయమృగ మె ట్లుండును' అని యొకయాటవికుని ప్రశ్నించెను. అతఁడు ఇట్లుండునని నేలపై గీతలు గీచి (గవయమృగాకారమును) చూపెను. పల్లెటూరివాఁడు గీతలతో నుండునది గవయమృగము అను నిశ్చయముతో నుండెను. ఒకనాఁ డడవికిఁ బోవుట తటస్థించి జానపదుఁడు యదృచ్ఛగ నచట గవయమృగమును జూచి ప్రక్కనున్నతోడివారలవలన నది గవయమని యెఱింగికొని "గీతలతో నుండునది కాదు గవయమన; ఇదిగో, ఇట్లుండును" అని వెనుకటి రేఖాగవయబుద్ధిని ద్యజించెను.

అదేవిధమున- 'అయమాత్మా పురుషః" మున్నగు శ్రుతివాక్యములచే ఆత్మ నెఱుంగని యజ్ఞాని అనాత్మయం దాత్మత్వ మారోపించుకొనియుండి గురూపదేశానంతరము యథార్థమగు నాత్మస్వరూపము నెఱింగి జ్ఞానియై వెనుకటి అనాత్మాత్మత్వబుద్ధిని వదలి వైచును.

స్థూలారుంధతీ న్యాయముగ అనఁగా- మంచపుపట్టె నక్షత్రములక్రింది భాగమున వంకరగానుండు మూఁడుపెద్ద నక్షత్రములలో మధ్యనక్షత్రము ప్రక్కన మినుకు మినుకు