పుట:SamskrutaNayamulu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
99

సంస్కృతన్యాయములు

 "యథా రుమాయాం లవణాకరేతు,
మేరౌ యథా వోజ్జ్వలరుక్మభూమౌ,
యజ్జాయతే తన్మయ మేవ త త్స్యా,
త్తథాభవే ద్వేదవిదాత్మతుష్టిః"

తంత్రవార్తికము.

ఉప్పుభూములలో మొలచినచెట్లు, బంగారుతో నిండి యుండు మేరువుపైనఁ బుట్టిన తరుగుల్మలతాదులు తన్మయములు అనఁగా ఉప్పువికారములు, బంగారువికారములు అయినట్లే వేదవేత్తయొక్క ఆత్మతుష్టి తన్మయమే అవును.

రూపసామాన్యన్యాయము

రూపసామాన్యముచే రెండు వస్తువుల నొకటిగాఁదలంచుట.

'ఆఁ, మేముకొనిన చీరెలే ఇవి'. అనఁగా- మేము కొనిన చీరెలుకూడ ఇట్లే యుండును అని భావము.

రేఖాగవయన్యాయము

రేఖలతో నుండునదే గవయ మృగ మనుకొనిన యతఁడు తుదకు గవయము నెరింగినయట్లు.

"కీదృశో గవయ ఇతి గ్రామీణేన పృష్టో వన్యో (గవయం) లిఖిత్యాదర్శయామాస| స చర్జుబుద్ధిత్వా ద్రేఖాగవయ మేవ గవయం మేనే| పశ్చా ద్వనే గవయం దృష్ట్యా రేకాయాంతద్బుద్ధిం తత్యాజేతిలౌకికీగాథా| 'తదైషపురుష'