పుట:SamskrutaNayamulu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
101

సంస్కృతన్యాయములు

మనునది అరుంధతీనక్షత్రము అని చెప్పిన చూడకయే 'ఆ తెలిసినది' యని ప్రతిపెద్ద నక్షత్రము ప్రక్కను మినుకు మినుకు మను నదెల్ల నరుంధతిగా శంకించునాతఁడు ప్రత్యక్షముగ ఫలానా నక్షత్ర మరుంధతి యని చూపించిన చూచి వెనుకటి అనరుంధత్యరుంధతీత్వమతి నావలకొత్తి యాథార్థ్య జ్ఞానమున స్వస్థచిత్తుఁ డవునట్లు.

రోగిన్యాయము

రోగి సమసిన, రోగము సయితము సమయును.

లతావృక్షన్యాయము

చెట్లఅండ లేనిచో తీగ నిలఁబడఁజాలక నేలఁబడును.

పురుషుఁడు లేనిచో స్త్రీ అధోగతి నొందును.

లపోరశంఖన్యాయము

శంఖముతీరున నూరక మ్రోగడమే.

క్రియమాత్రము శూన్యము అని భావము.

లవణామలకీయన్యాయము

సముద్రపుటుప్పు అడవియుసిరికాయ కలసినట్లు. కుచే. 2-78

"कहाँ का ईंट, कहाँ का गॊरा, भानमती नॆ कुनबा जॊडा" అని హిందీసామెత.

లశునభక్షణన్యాయము

ఆశపడి వెల్లుల్లి తినినా రోగము పోలేదఁట.