పుట:SamskrutaNayamulu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
97

సంస్కృతన్యాయములు

యోజనయా ప్రతితిష్ఠంతీత్యత్ర నార్థాంతర్భావేన యేచ ప్రతిష్ఠా స్సంతి తే ఏతా రాత్రీ రుపేయు రితి వాక్యవిపరిణామేన యథా రాత్రివిధిః ప్రకల్ప్యతే తథేహాపీతి"||

మాధవీయశంకరవిజయము (8-84).

"యద్వత్ప్రతిష్ఠాఫల..." శ్లోకవ్యాఖ్య.

విధివిధీయమానము లగు సోమయాగవిశేష రాత్రిసత్రములకు యాగఘలము లయిన స్వర్గాదికములు ప్రత్యేకముగ నుడువఁబడకుండుటవలన విపరిణామేన సూత్రమునఁ బ్రయోగింపఁబడియున్న ప్రతితిష్ఠంతి అను పదముచేఁ బ్రతిష్ఠయే ఫలముగఁ గల్పితమవుచున్నది.

అగతికమైనపు డేదో యొక గతి కల్పించుకొనుపట్ల నీ న్యాయ ముపయుక్త అంవు నని పరిణామము

రామఠకరండన్యాయము

ఇంగువపెట్టెలోని యింగువ తీసివైచినను వాసన యెన్నఁటికిని పోనట్లు.

తాత్కాలికముగ కించుదన మాపాదించినను వెనుకటివాసి పోదు.

రాసభరటితన్యాయము

గాడిద అఱపు మొదట దీర్ఘమై పోనుపోను సన్నగిలును. (ఆరంభశూరత్వము) దుర్జనస్నేహము నంతియే.

పరాహ్ణచ్ఛాయాన్యాయమును జూడుము. రాసభరుతన్యాయ మనియు దీనికిఁ బేరు.