పుట:SamskrutaNayamulu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
96

సంస్కృతన్యాయములు

వేయేల, రాజుగారియింటిలోని పిల్లికినిగూడ వెఱువవలెను. లేనిచో వానికాయుద్యోము, బ్రదుకుతెరువు నండవు.

సేవకావృత్తిని, ఆశ్రితునకుండవలసిన నడఁత నీన్యాయము సూచించును.

రాజానుసృతవివాహప్రవృత్తభృత్యన్యాయము

పెండ్లికి పోయే రాజుగారివెంట వారిభటుడుకూడా పోవును.

సత్పురుషులతో బాటు వారి ననుసరించియున్నవారుకూడ గౌరవింపఁబడుదురు.

ఈశ్వరునితో బాటు శరీరమున నున్నపన్నగములును దేవతల మ్రొక్కు లందుకొనును.

రాత్రిసత్రన్యాయము

రాత్రివేళ జేయఁబడు సోమయాగాదులకు ఫల మగతికమై ప్రతిష్ఠయే ఫలముగాఁ గల్పింపఁబడినట్లు. అగతికమైనపు డేదో యొక గతి కల్పించుకొనుపట్ల నీ న్యాయ ముపయుక్త మవు నని పరిణామము.

"ప్రతితిష్ఠంతి హ వా య ఏతా రాత్రీ రుపయం" తీతి శ్రూయతే| తత్ర రాత్రిశబ్దే నాయుర్జ్యోతిరిత్యాదివాక్య విహితా సోమయాగవిశేషా ఉచ్యంతే| అత్ర యద్యపి ప్రతితిష్ఠంతీతి వర్తమానాపదేశాత్‌ సిద్ధరూపైవ ప్రతిష్ఠా ప్రతీయతే న సాధ్యరూపా| తథాపి శ్రుతాయా ఏవ ప్రతిష్ఠాయా విపరిణామేన ఫలకల్పనస్యాంతతా శ్రుతస్వర్గస్య ఫలకల్పనాపేక్షయావరత్వాత్‌| యత్తదో ర్వ్యత్యాసేన