పుట:SamskrutaNayamulu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
95

సంస్కృతన్యాయములు

తలిదండ్రులచే విడువఁబడి రాజపుత్రుఁ డొకఁడు చిన్నతనముననుండియు వ్యాధులతోఁ గలిసి పెరిగెను. వయసు వచ్చినతరువాతఁగూడ వ్యాధుఁడ ననియే ఆతనితలంపు. ఒకనాఁడు కొందఱు రాజపుత్రు్ లాతని గుర్తించి వాని జన్మాదికము నంతయుఁ జెప్పిరి. అపుడు వాఁడు వ్యాధత్వ బుద్ధి ద్యజించి రాజయ్యెను.

స్వస్వరూపజ్ఞానము కలిగిన వెనుక వెనుకనున్న భ్రాంతు లన్నియు నశించి సంసారబంధమే తెగిపోవును.

సింహమేషన్యాయము జూడుము.

రాజపురప్రవేశన్యాయము

రాజపట్టణమున నొక్కసారిగఁ బలువురను ద్వారపాలురు ప్రవేశింపనీయరు. ఒక్కొకరివంతునమాత్రమే పోవలసి యుండును.

అదరుచు బెదరుచు నొక్కరొకరుగ రాజపురప్రవేశ మొనరించుచున్న ద్వారపాలు రట్టహాసముతో నడ్డగింతురు. అందఱు నొకసారిగ నిర్భీకులై ద్వారమునఁ బ్రవేశించిన దౌవారికులు గోడమీఁది బొమ్మలవలెఁ జూచుచుందురే కాని కించిత్తు మాటాడరు; వారించరు.

(సంఘబలము.)

రాజసేవాన్యాయము

రాజును సేవించునాతఁడు రాజునకును, రాజకుటుంబమునకును, మంత్రిని, సలహాదారునకును, ఆశ్రితులకును,