పుట:SamskrutaNayamulu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
98

సంస్కృతన్యాయములు

రాహుశిరోన్యాయము

రాహుశిరఃస్వరూపనిర్ణయము లేనట్లు.

రాహువుశిరస్సు పాము అనియు; అదొక ఛాయాగ్రహమనియు; కాదు, రాక్షసుఁడనియు ననేకు లనేకరీతులు జెప్పుచుందురు.కాని అందేదియో ఇంతవఱకును దేలలేదు. తేల్చువారును లేరు.

సందేహాస్పదములై వాదప్రతివాదములలో నున్న విషయములయం దీన్యాయ ముపయుక్తము.

రుమాలశునార్ఘన్యాయము

ఉప్పుకొటారులో ఉల్లిపాయధర ఎంత అన్నట్లు.

"రాజన్‌ రుమాయాం లశునస్య కోఽర్ఘః?" - ఒక బ్రాహ్మణుఁ డొకయింటికి మాధుకరమునకుఁ బోయెను. ఇంటియజమానురా లాయనను జూచి ఎదురేగి- "రాజా! ఉప్పుకొటారులో ఉల్లిపాయధర ఎట్లున్నది?" అని ప్రశ్నించెనఁట."

సంబంధము లేని మాటలు అని భావము.

రుమాక్షిప్తకాష్ఠన్యాయము

ఉప్పునేలలో పాతిపెట్టఁబడిన చెట్టువలె.

ఉప్పురసమున బెరిగి ఈలకూరవలె నదియు ఉప్పగనే ఉండును.