పుట:SamskrutaNayamulu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
88

సంస్కృతన్యాయములు

యూత్ప్రాయ: శ్రూయతేన్యాయము

తఱచుగా వినుచుండుదానినే నిజమని విశవసించుట లోక స్వభావము.

యధాక్రతున్యాయము

క్రతువు బ్రహ్మస్వరూప మనిట్లే యజమాని బ్రహ్మస్వరూపు డవును.

"అసా నాదిత్యో బ్రహ్మ; అన్నం బ్రహ్మ; అహం బ్రహ్మ" అనువాక్యములవలె "యజమానం బ్రహ్మేత్యుపాసీత;" "యజమానరూపోనై" ఇత్యాది వాక్యముల నెఱుంగనగును. మీమాంసాశాస్త్రమున నీన్యాయము తఱుచు వాడబడును.

యధారాజన్యాయము

యధా రాజా, తధా ప్రజా

యధాసంఖ్యన్యాయము

సమానపడస్థములగు ప్రత్యయాదులకు విధింపబడిన విధులు క్రమము తప్పక ప్రవర్తించును.

అనగా మొదటివిధి పదమందలి నిర్థిష్టప్రత్యయములలో మొదటిదానికిని; రెండవది రెండవదానికిని; మూడవది మూడవదానికిని. ఇట్లే తక్కింవన్నియు ప్రవర్తించు చుండును.