పుట:SamskrutaNayamulu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
87

సంస్కృతన్యాయములు

మృద్ఘటన్యాయము

కొండయొక్క ఆదిమధ్యావసానముల నుండునది మృత్తికయే, కొంతకాలము మాత్రము స్వరూపము కల్పింప బడినది.

అట్లే జగత్తులయొక్క ఆదిమధ్యావసానముల నుండునది బ్రహ్మపదార్ధమే. జగదాదికస్వరూప మాబ్రహ్మవిలాపము, పటతంతున్యాయమువలె.

మేఘచాతకన్యాయము

చాతకపక్షి మేఘములోనుండి కురిసిన నీరేగాని యితర జలము నపేక్షింపదు.

జ్ఞాని పరానందమేగాని తుచ్చలౌకికవిషయానంద మపేక్షింపడు.

మేషపుచ్చన్యాయము

మేక ఎంత బలసినా తోక బెత్తెడే

మేషయుద్ధన్యాయము

పొట్టేలు పొట్టేలు దెబ్బలాడుచుండగా నడుమ నక్కపడి చచ్చినట్లు.

యత్పరః శబ్ధన్యాయము

తరువాత పుట్టినదే శబ్ధము.

(ముందు తేజస్సు, తరువాత శబ్ధము పుట్టును గాని ముందే శబ్ధము పుట్టదు.)

అర్ధవంతమైనదే శబ్ధము