పుట:SamskrutaNayamulu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
89

సంస్కృతన్యాయములు

ఈన్యాయము వ్యాకరణమందలిది. "యథాసంఖ్య మనుదేశః సమానామ్‌" అనునది యీన్యాయమునకు మూల మాత్రము. సూత్రార్థము న్యాయముక్రిందనే వివరింపఁ బడినది. ఆ సూత్రప్రవృత్తి ఎట్లన:-

"టా జసి ఙసా మినాఽఽత్‌ స్యాః" అని పాణినీయ సూత్రము. టా, ఙసి, ఙస్‌లకు ఇన, ఆత్‌, స్య అనునవి ఆదేశము లగును అని సూత్రార్థము.

టా, ఙసి, ఙస్‌లు తృతీయ, పంచమి, షష్ఠి విభక్తి ప్రత్యయములు. ఇన, అత్‌, స్య ఇవి ఆప్రత్యయములకు విధింపఁబడిన కార్యములు.

అగుచో, సూత్రమందలి నిర్దిష్టప్రత్యయములలో మొదటిదవు 'టా'కు ఆదేశవిధులలో మొదటిదవు 'ఇన' యును; రెండవ ప్రత్యయమవు 'ఙసి'కి 'ఆత్‌'; మూఁడవదవు 'ఙస్‌'కు 'స్య' యును క్రమము తప్పక యథాసంఖ్యముగఁ బ్రవర్తించును.

యవవరాహన్యాయము

అడవిపంది చేను మేయఁగా ఊరపంది చెవులు గోసినట్లు.

యవవరాహాధికరణన్యాయము

యవ, వరాహ శబ్దముల కధికరణరూఢ మవు నర్థమే గ్రాహ్య మైనట్లు.