పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మేల కలుగవలయును. ఎవడు నాపై రాజున కలుకపుట్టించెనో తెలియదు.

స్ఫటికముతో జేయబడిన వలయము విఱిగినచో మరల నదుక రాని యట్లు రాజునకు విముఖత గలిగినపు డాతని మనసు మరలుప శక్యముగాదు.

పిడుగు, రాజ తేజము మిక్కిలి భయంకరములు. అందు మొదటిది యొక్కచోటనే పడును. రెండవది యన్ని ప్రదేశము లందు బడును.

ఇక నాతని యాజ్ఞ కెదురు చూచుట మంచిదిగాదు. మరణించిన స్వర్గము గలుగును. శత్రుని జంపిన సుఖము గలుగును. శూరున కీ రెండే మంచిదారులు. యుద్ధము చేయకున్నను మరణము తప్పనిసరియై, యుద్ధము చేయునెడ బ్రదుకుటకు గొంచెమైన వీలున్నపు డది యుద్ధముచేసి తీరవలసిన సమయమని బుద్ధిమంతులు తలచెదరు. కావున యుద్ధమొనరించి చచ్చుటయే మేలు." సంజీవకు డీవిధమున నాలోచించి దమనకునితో నిట్లనెను.

"మిత్రమా! ఆతడు నన్నేవిధమున జంప దలచెనని నీయభిప్రాయము?"

దానికి దమనకుడు "పింగళకుడు చెవులు నిగిడించి నోరు దెఱచికొని, చరణములెత్తి నీమీది కుఱుకుటకు సిద్ధ