పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పడినపుడు కొలది గడియలలో నీవే తెలిసికొనగలవు.కాని యీ విషయ మంతయు గుప్తముగా నుంచుము. రహస్య మేమాత్రము వెల్లడియైనను నీతోబాటు నాకును జీవితము నేటితో సరి." యని సమాధాన మిచ్చెను. కొంతసే పిట్లు తగని వగలు నటించి సంజీవకుని బింగళకుని మీద యుద్ధమునకు బురికొల్పి యాతని వీడుకొని కరటకుని కడకు బోయెను. ఆత "డేమి జరిగినది" యని యడుగగా దమనకు డిట్లు చెప్పెను.

"సందియమేల? దుష్టులకు జుట్టములును, యాచించినచో గోపింపనివాడును, విత్తముతో సంతుష్టినొందువాడును నెందైన నుందురా?"

ఈ విధముగా బలికి తిన్నగా దమనకుడు పింగళకుని కడకేగి వందన మాచరించి యెంతో దిగులు చెందిన వానివలె గూరుచుండెను. పింగళకుడు "దమనకా! సంజీవకుని వైఖరి యేమైన మరల దెలియవచ్చినదా?" యని ప్రశ్నింపగా "బ్రభూ! చెప్పుటకు నోట మాట రాకున్నయది. ఆత డెంతదుష్టు డయినను నేమైనను మంచి యూహ కలుగు నేమో యని యాసించి యాతనిజాడ గనిపెట్టి యుంటిని. ఆతడు తనపాపపు జింత విడువలేదు సరికదా! యిక నెంత మాత్రము నాలసింపక ప్రభువువారి కాపదగలిగింప నుద్యుక్తుడై యున్నాడు. కొలది నిముసములలోనే ప్రభువు వారి