పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంచిగందపు జెట్టున ద్రాచు బాములు, జక్కని కమలములుగల చెఱువులందు మొసళ్లు, సుఖములయందు విఘ్నములు జేరియుండును.

మంచిగందపు జెట్టున మొదట సర్పములు చుట్టుకొని యుండును. కుసుమములయందు దుమ్మెదలు క్రమ్ముకొని యుండును, శాఖములపై నెలుగుబంటులు నివసించును, శాఖాగ్రములపై గోతు లల్లరిచేయుచుండును. దానియందు దుష్టు లాశ్రయింపని భాగము గొంచెమైననులేదు. ఈ ప్రభువు మాటలు తియ్యగా బలుకును. హృదయమున విషము ధరించియుండును. చేష్టలన్నియు బ్రేమమయముగ గానబడును. ఈత డీవిద్య యెచ్చట నేర్చినాడో కదా!

సముద్రము దాటుటకు నావయు, జీకటి దొలగించుటకు దీపము, గాలి లేనపుడు విసనకఱ్ఱయు, నేనుగుల మద మణంచుట కంకుశము ననెడి యుపాయములు దేవుడు కల్పించియున్నాడు. కాని దుష్టుని మనసు మార్చుట కే యుపాయములు జూపజాలక భగ్నమనోరథు డయినాడు." అని తలపోసి మరల నిట్టూర్పుపుచ్చి యిట్లు చింతించెను.

"కేవలము సస్యము దిని జీవించు నన్ను మృగరా జేల చంపవలయును? విత్తము, బలము, సమముగా గలవారితో గలహించుటకు గారణముండును గాని నావంటివానిపై గోప