పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రాహ్మణు డట్లు వెడలిన తరువాత నొక నల్లత్రాచు శిశువు చెంతకు బ్రాకిపోవుచుండెను. ముంగిస యదిచూచి సర్పము మెడబట్టి కొఱికి చంపివైచి దానిశరీరమును ముక్కలు ముక్కలుగా జేసివైచెను. నోటినిండ, దనదేహమునిండ బాము రక్త మెఱ్ఱగా నిగనిగలాడుచుండగా నాముంగి మరల ద్వారము నొద్దకు వచ్చి నిలిచెను.

అచట నాదేవశర్మ రా జొసగిన విలువయైన దానము బుచ్చుకొని బిడ్డ యేమయ్యనో యని తలచుకొనుచు మిక్కిలి త్వరితముగా నింటికి వచ్చెను. వచ్చియురాగానే నెత్తుటితో నిండియున్న ముంగి తన విధిని జయప్రదముగా నెఱవేర్చితి నన్న గర్వముతో యజమానుని పాదముల కడకు బరుగిడెను. ఊయలలోను, దాని శరీరమునను గల రక్తము కంటబడగానే యాముంగిస దన బిడ్డను గొఱికివైచినదని యెంచి యా బ్రాహ్మణుడు కోప మాపుకొనలేక యచటనున్న రోకటితో గొట్టి దానిం జంపి వైచెను. అనంతర మాత డూయెలదగ్గఱకు బోయి సంతసముతో గాలుసేతు లాడించుచు నవ్వుచున్న తనబిడ్డను గనుగొనెను. ప్రక్కను తునుకలుగా జేయబడి యున్న సర్పమును గాంచెను. వెంటనే జరిగిన సంగతి గ్రహించి గుండెలు బాదుకొనుచు "మందబుద్ధినగు నేను బాగుగా నాలోచింపక తొందరపడి దారుణము గావించితి" నని విలపించు చుండెను. ఇంతలో యజ్ఞసేన స్నాము చేసివచ్చి జరిగినది