పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చున్నావు. వీడు తనవాడు, వీడు పరుడు నని యల్పబుద్ధి గలవారు తలపోయుదురు. బుద్ధిమంతు లట్లు భావింపక లోకమంతయు నొకేకుటుంబమని యెంతురు. ఈ లేడి నీకెట్టి చుట్టమో నాకును నట్టిబంధువే." ఈ మాటలు విని "యట్లే యగు గాక" యని కాకియు దానిచెలిమి కంగీకరించెను. అప్పటినుండియు నాలేడియు, నక్కయు, గాకియు మిక్కిలి స్నేహముగలిగి యా వనమున నివసించుచుండెను.

కొంతకాలమునకు బిమ్మట సుబుద్ధి లేడితో రహస్యముగా నిట్లు పలికెను. "యీ యడవియం దొక్కచోట సస్యముతో నిండిన పొలమున్నది. దానిని నీకు జూపుదునుర" మ్మని జింకను వెంట దీసికొనిపోయి సుబుద్ధి పంటపొలము దానికి జూపెను. లేడియు రోజురోజు నచటికి బోయి యాపయిరు దినుచుండెను.

ఒకనాడు పొలముకాపు పయిరు దినివేయబడుచుండుట జూచి, వలపన్ని వెడలెను. జింక మేతకు బోయి యావలలో జిక్కుకొని "నన్నీ వలనుండి, తప్పించి కాపాడు దిక్కెవరు?" అని చింతించుచుండ జంబుకము వచ్చి చూచి "నాతంత్ర మిప్పటికి నెఱవేఱినది. ఇది చంపబడినయెడల దీని మాంసాదులు చాలకాలమువఱకు నాకు భోజనమునకు సరి పోవును." అని తలచుచు దరి కేగెను.

లేడి జంబుకమును గాంచినంతనే సంతసించి "సఖుడా! త్వరితముగా వచ్చి నాబంధములు గొఱికి నన్ను గాపాడు"