పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మని కోరెను. ఆ నక్కయు మఱింత దగ్గరగా వచ్చి మాటిమాటికి వలను బరిశీలించి చూచి "మిత్రుడా! యీవల నులి నరములతో జేయబడినది. దీనిని నే డాదివార మగుటచేత దాక జాలను. నీవు వేఱుగా భావింపకుము. తెల్లవారగనే నీవు చెప్పినట్లు చేయుదును." అని పలికి సమీపమందలి పొదచాటున దాగియుండెను.

అనంతరము సాయంకాలమైనను లేడి తిరిగి రాకుండుట చేత వాయస మనుమానపడి యటునిటు వెదకుచు వచ్చి వలలో దగులుకొనియున్న మిత్రుని జూచి "ఇది యేమి?" యని యడిగెను.

"మిత్రుని మాట వినకుండుటవలన గలిగిన ఫలితము. హాని సిద్ధమైయున్నపుడు సఖుల మాటలు చెవి కెక్కునా!" యని పలికి లేడి సంగతియంతయు వివరించెను. "జంబుక మెచట నున్న" దని వాయస మడిగెను. "నా మాంసము దిన గోరుచు నిచటనే యుండు" నని మృగము బదులు పలికెను. అపుడు కాకి యిట్లనెను.

"నేను ముందే చెప్పితిని. నాయం దేమియు దోసము లేదు గదా యని దుర్మార్గులను నమ్మరాదు. వారు సుజనులకు గూడ హానిచేయగలరు. మరణము సమీపించినవారు దీప మాఱిపోవునప్పటి గంధ మాఘ్రాణింపలేరు. మఱియు వారి కరుంధతీ నక్షత్రము గోచరింపదు. మిత్రులమాటలు చెవికెక్కవు