పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"పాపము లన్నిటికి రాజే పాత్రు డగును. ఇతరులు రాజ్యసుఖ మనువింతురు. రాజ్యమున గొంతభాగముం గోలు పోయిన నెన్నడైనను మరల సంపాదింపవచ్చును. ఉత్తములగు సేవకులం గోలుపోయిన యెడల నట్టివారు తిరిగి లభించుట యసంభవము."

ఇట్లు విచారించుచున్న పింగళకుం జూచి దమనకుడు "స్వామీ! పగవానిం జంపి విచారించుట పాడిగాదు. సుతుడుగాని, సోదరుడుగాని, సఖుడుగాని, యపాయము గలిగింప దలచెనేని సంపదల నందగోరు రాజు వారిం జంపితీర వలయును. ధర్మార్థ కామముల తత్వమెఱింగిన వారెవరు నతిదయకు లోనుగారాదు. మితిమీఱిన యోరిమిగలవాడు చేత జిక్కిన ఫలమయిన ననుభవింప జాలడు. మిత్రుల యెడలను, శత్రుల యెడలను సమానముగా శాంతి బూనుట యోగులకు మాత్రమే తగును. ఆశాంతియే యపరాధులందు జూపుట రాజులకు దోసమగును. అహంకారము చేతను, రాజ్యమందలి యాశచేతను బ్రభుపదము నాక్రమింప దలచువానికి మరణదండన మొక్కటియే ప్రాయశ్చిత్తము.

జాలిగలరాజు, సర్వభక్షకుడగు బ్రాహ్మణుడు, వశము దప్పిన భార్యయు, దుష్టచిత్తు డగు మిత్రుడును బ్రమాదము గలిగించు నధికారియు, జేసినమేలు మఱచువాడును సర్వదా విడువందగుదురు. రాజనీతి వేశ్యాంగన