పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వంటిది. ఒకపుడు సత్యముతోను మఱియొకపు డసత్యముతోను గూడినదై యుండును. ఒకపుడు గాఠిన్యము గలిగియుండి మరియొకపుడు ప్రియవచనములతో గూడినదైయుండును. ఒకపుడు క్రూరముగను నింకొకపుడు దయా యుక్తముగను నుండును. ఒకపుడు లోభముగలిగియుండి మఱియొకపుడు దానగుణముతో నొప్పు చుండును. ఒకపు డతివ్యయము గలదియు, మఱొకపుడు విస్తారమయిన ధనము, రత్నములు సంపాదించునదియునై యుండును." అని బోధించి యోదార్పగా బింగళకుడు సరిపెట్టుకొని యూరడిలి యుండెను. దమనకుడును సంతసిల్లి 'సకలజనులకు శుభమును, రాజునకు జయమును వర్ధిల్లునుగాక యని పలికి తిరిగి రాజాదరము నొంది సుఖముగా నుండెను."

అని వినిపించి విష్ణుశర్మ రాజపుత్రులతో నిటులనెను. "మీ రిపుడు మిత్రభేదము సాంతముగా వినియుంటిరి. మీరును శత్రునిలయములం దిటులే మిత్త్రభేదము గల్పించి విజయముం గాంచి వర్ధిల్లు" డని పలికెను.

-------