పుట:SampurnaNeetiChandrikaPart1.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మీది కాతడు రాగలడని యాతని వైఖరింబట్టి నాకు దోచినది. కావున బ్రభువువా రేమఱక యుండుదురు గాక యని నా మనవి.

సంజీవకుని వధ

దమనకు డిట్లు పలుకుచుండగనే పింగళకునకు దూరమున సంజీవకుడు వచ్చుచున్న జాడ తోచెను. అంతట బెల్లుబికి వచ్చుచున్న కోపము నడచుకొన జాలక నోరు దెఱచికొని చరణము లెత్తి మీదికి దుమికి సంజీవకు నొక్కమ్మడి జీల్చివేయుటకు సంసిద్ధుడై యుండెను.

సంజీవకుడును దూరమునుండియే పింగళకుని వైఖరింజూచి దమనకుడు చెప్పిన దంతయు 'అక్షరాల' నిజము కదా! యని యెంచి తనశక్తి కొలదియు విక్రమము జూప దలచి తలవంచి కొమ్ము లేటవాలుగా జేసి యతి వేగమున సింహము నొక్క క్రుమ్ము క్రుమ్మెను. పింగళకుడు నాదెబ్బకు నొచ్చుకొనియు సంజీవకుని బలమునకు మెచ్చుకొని, తనకు గలిగిన యవమానము భరింపలేక మండిపడి యావృషభముం జిత్రవధ గావించి కసిదీర్చుకొనెను.

పిమ్మట గొంతసేపటికి బ్రాణమిత్రుడగు సంజీవకుని జంపుట యక్రమమని తలపు గలిగి పింగళకుడు దు:ఖా కాంత్రుడై యిట్లు చింతించెను.