Jump to content

పుట:SamardaRamadasu.djvu/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వుగారివెంట నుండు, "కళ్యాణస్వామి" యను శిష్యుడు, గురువునోటనుండి వెడలిన ప్రతిముక్క, నెప్పటికప్పు డెక్కించి దాచుచుండును. అందుచేత, నది పెద్ద సంపుట మయ్యెను. రామదాసుడు చనిపోవు రెండు మూడు దినములక్రిందవరకు, శిష్యునకు జెప్పి, యాగ్రంథము వ్రాయించు చుండెను. చివరదినములలో, నతడే యాగ్రంథమునందు కొన్నిమార్పులను తన స్వహస్తములతో జేసెను.

దాసబోధలో నిరువది దశకములు గలవు. దశకమునకు పదేసి శ్లోకములుండును. కొన్ని చోట్ల గుర్ఫుశిష్యులకు సంవాదము జరిగినట్లుగ వ్రాయబడెను. ఆ గ్రంథములో నత డనేక ప్రపంచసమస్యలను విప్పెను. అతని శైలి ఖడ్గధారవలె, నిశితమై, పరవాదములను ఖండించుకొని పోవుచుండును. కఠినమై చిక్కులుగల సమస్యలను విప్పుటలో దాసబోధవంటి మహాగ్రంథ మింకొకటి లేదనియే చెప్పవచ్చును. మహారాష్ట్రదేశము స్వాతంత్ర్యమను యమృతము చవిచూచుచు, మహోత్కృష్టదశను బొందుచుండగ శివాజీ 1680 సం. రాయఖడ్ కోటలో మృతినొందెను. చనిపోవునప్పటికి, నతనికి వేబది మూడు సంవత్సరములు, అందుచే నతనిని అల్పాయుష్మంతుడనియే జెప్పవచ్చును. ఆయన మరణము రామదాసునకు పిడుగుపాటు వంటిది. ఆవార్త వినగానే మొగము దిగాలు వేసుకొని నిశ్శబ్దముగ తన గదిలోనికి బోయెను. శివాజీ తరువాత, సింహాసన మెక్కిన యతనికొడుకు శంభాజీ తండ్రివలెనే, శౌర్యవంతుడు, బలవంతుడునై, రాజ్యము వృద్ధిచేయు తలంపుగలవాడే కాని ఔరంగజీబు యొక్క కుతంత్రములవలన, నాతని చారుల చేతులలో బడెను. చారులు మిత్రులవలె నటించి, శంభాజీని జారునిగను, త్రాగుబోతుగను, జేసిరి. పూర్వపు మంత్రులు, శత్రువుల చారుల బారినుండి తొలగించుటకు బహుప్రయత్నములు చేసిరిగాని, యవి నిష్పలము లయ్యెను. శంభాజీ కన్యాకుబ్జబ్రాహ్మణుడైన "కలుషు" డను నొక బ్రాహ్మణుని వశములో నుండెను. వాడు తక్కిన చారులతో గలిసి, శంభాజీ మెడకు దుస్తంత్రములను నురిత్రాళ్ళను గట్టిగ బిగించెను. గొఱ్ఱె కటికవానిని నమ్మినట్లు, శంభాజీ వాడేదిచెప్పిన, నజ్ది చేయుచుండెను. "కలుషు"డు శంభాజీని వశవర్తుని జేసికొని, సవతితల్లియగు