రామదాసుడు స్థిరమైన యాలోచనలు శిష్యునకు చెప్పుచుండెను. ఆపదలు తప్పించుకొను నుపాయములుగూడ జెప్పుచుండును. ఒకానొక సమయమున మహారాష్ట్ర సామ్రాజ్యము నేలమట్ట మగునట్టి మహాపత్తు వచ్చినప్పుడు రామదాసుడు చెప్పిన యుపాయమే శివాజినీ రక్షించెను. ఈనాటి పాశ్చాత్యశిల్పులుగూడ మెచ్చుకొని, నాశ్చర్యపడునట్లు, గొప్పగొప్ప కోటలు నిర్మించుటలో రామదాసు బుద్ధి యసమానమైనది. సున్నము తయారు చేయుట, తోటలు వేయుట, కోటలుకట్టుట మొదలయిన విషయములలో నప్పు డప్పూ డాశుధారగా కవిత్వముతో, నుపన్యాసము లిచ్చెడివాడు. మొక్క లెక్కడెక్కడ పాత వలెనో, యేయేవరుసలుగ నాటవలెనో యతనికి మిక్కిలి బాగుగా తెలియును. మహమ్మదీయులన్న రామదాసునకు, ద్వేషము లేదుగాని, వారి దండయాత్రలను, తిరుగుబాటులను నణచి ఎదిరించవలసినదని, రామదాసుడు ప్రజలను పురిగొల్పుచుండెను. హిందూమతధర్మరక్షణమే యతని ముఖ్యోద్దేశము. శిక్కుమతస్థాపకుడైన నానక్‌నందును, ఆతని మతమునందును రామదాసుడు చూపిన గౌరవము ఇంతింత యనరాదు. అత డితరమతములయందు ద్వేషము చూపగూడదని చెప్పునుగాని, హిందూమతసముద్ధరణ మనిన, నతనికి బ్రీతి. అయినను తన మతధర్మము నవలంబించునట్టివారిని బాధించువారిని జూచి, భరింప లేడు. మఠములలో జరుగునట్టి యుత్సవము లన్నిటికి, సర్వమతములవారిని, సర్వవర్ణములవారిని, నతడు చేర్చుకొనుచు వచ్చెను. ఈవిధముగ రామదాసుడు, సర్వజనులను తన మతబోధక్రిందకు దీసికొనివచ్చి, హిందువుల యార్థిక, నైతిక, సాంఘిక వ్యవహారస్థితిని వృద్ధిచేసెను. హిందువుల గౌరవము స్వాతంత్ర్యము నెక్కువయగునట్లతడు చేసెను. దాసబోధయను గ్రంథము రామదాసు రచించిన పుస్తకములలో, బహు వేదాంతవిషయములు గలిగియుడును. ఆకారణమున మహారాష్ట్రులు భగవద్గీత తరువాత దీనినే మహాగ్రంథముగ నెంచి, పూజింతురు. ఇది సకల విషయములు కలిగి గ్రంథకర్తయొక్క దివ్యజ్ఞానమును, జూబుచుండును. అది యొక్కసారి రచియింపబడలేదు. అప్పుడప్పుడతడు, పద్యరూపమున నాశుధారగా నిచ్చిన పద్యములందు గలవు. కాగితము, కలము, పుచ్చుకొని నిరంతరము గురు
పుట:SamardaRamadasu.djvu/69
Appearance