"తారాబాయిని" బ్రతికి యుండగనే, గోడలోబెట్టి కట్టించునట్లు చేసెను. అదిగాక, శంభాజీ వాని సలహాప్రకారము భక్తివిశ్వాసములు గలిగి మహారాష్ట్ర సామ్రాజ్యసౌధమునకు నిత్మాతలైన ప్రధాన మంత్రులను, ముఖ్యపురుషులను, నేనుగుకాళ్ళచే ద్రొక్కించి, చంపించెను. ఈ దౌర్జన్యములు రామదాసుని హృదయమును మండజేసెను. మహారాష్ట్ర సామ్రాజ్యము చాలకాలము నిలువదని, యతడు భయపడెను. శంభాజీ యప్పుడప్పుడు, రామదాసుని నిలయమైన, పైజాన్‌ఖాడ్‌నకు బోవుచుండెను గాని, రామదాసు డతనిని గలుసుకొనుట కిష్టపడడయ్యెను. ఒకానొకప్పుడు శంభాజీ రామదాసుని దర్శనము చేసినప్పుడు శంభాజీని రామదాసుడు, వాని దుర్నయమునకై కఠినముగ, జీవాట్లు పెట్టెను. శంభాజీ తన తండ్రి మార్గము ననుసరించి, వర్తింతునని నొక్కి చెప్పి, వెడలిపోయెను. రామదాసుని యొక్క హితోపదేశములకంటె దనచుట్టు జేరిన, దురాచారుల మాటలే యెక్కువ ప్రియములుగ నుండెను. ఎట్టకేలకు రామదాసుడు కడపటి ప్రయత్నముగ నొక జాబు వ్రాసెను. అదియు నిష్ప్రయోజనమే యయ్యెను. 1681 సంవత్సరమున అనగా శివాజీపోయిన సంవత్సరమునకే రామదాసుడు తన దాసబోధ యను గ్రంథమును బూర్తి జేసెను. అది మొదలుకొని, రామదాసునకు దేహారోగ్యము చెడెను. అందుచేత, నత డెవరికి, దర్శనమీయక యొక గదిలో కూర్చుండెను. రోగసంబంధమైన బాధలు నివారణజేసి కొనుటకు గొన్ని గ్రహశాంతులు మొదలయినవి చేసికొమ్మని, కొందఱు శిష్యులు చెప్పి శంభాజీమహారాజుయొక్క యాస్థానవైద్యుని, బిలిపింపుమని, కోరినప్పుడు రామదాసుడు, కఠినముగ నిట్లు చెప్పెను. "ఇది యెంత పరిహాసాస్పద్ఫ మయినపని, అది మన విశ్వాసమును, వైరాగ్యమును భంగపఱుపదా? ఈ భౌతిక శరీరము క్షణభంగురమని, బోధించునట్టి మనమే, దీనికొరకింత, విశ్వప్రయత్నము చేయదగునా? ఈ శరీరము మనదిగాదు, ఇది యొక చొక్కావంటిది. ప్రాతగలిగినప్పుడు, దానిని త్రోసి పారవేయవలసినదే! ఈ సంగతి భగవద్గీతలో చెప్పలేదా? ఈ శరీరము పంచభూతములలో గలిసిపోవువఱకు విధి దాని కేమివిధించెనో యవియన్నియు యనుభవించితీరవలసినదే! గ్రహశాంతులు నవసరము లేదు; వైద్యుని యవసరము
పుట:SamardaRamadasu.djvu/71
స్వరూపం