పుట:SamardaRamadasu.djvu/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదియవ ప్రకరణము

శివాజీ - రామదాసులు

బోధన ప్రచారము గొప్ప దశలో నున్న కాలమున రామదాసుడు మహారాష్ట్రదేశమున సంచారము చేయ నారంభించెను. మఠములన్నింటిని జూచి పరిశోధించుటకును, జనుల మనస్సులమీద మతబోధ యెంతవఱకు నాటు కొనినదో దెలిసికొనుటకును నతడీ సంచారము ప్రారంభించెను. జనులు గాడ నిద్రనుండి మేలుకొని స్వమతావిష్టులై దేశము కొఱకుదమ సర్వస్వమును ధారవోయుటకు సిద్ధముగ నుండిరని యతడు తెలిసి కొనెను. ప్రపంచములో దుర్జనులు లేకుండ బోవరు. రామదాసు శిష్యులు చేయుచున్న సత్కార్యమున కిష్టపడక విఘ్నములు కలిగించి వారికి గొందఱపకారము గూడ జేయదలంచిరి. అట్టి దుష్టులవల్ల గొందఱికి బ్రాణాపాయముగూడ గలుగునట్లు కనుపించెను. కాని యా శిష్యులు తమ గురువు పేరునకు భంగము కలుగుకుండ మెలకువతో వర్తించి ప్రాణాపాయములు దప్పించుకొనుచు వచ్చిరి. లంచములు నిరాకరించుచు సత్కార్య ధురంధరులైన యా శిష్యుల కార్యదీక్షవలన రామదాసుని పేరు మహారాష్త్ర దేశమున బ్రతి కుటీరమునందును, ప్రతి యంత:పురమునందును గూడ జెప్పుకొనబడుచుండెను. రామదాసుని పేరు చెప్పని వారు తలపనివారు లేరు. ఈ మత బోధల పర్యవసాన మెట్లుండునా యని ప్రతి వ్యక్తి విచారింపజొచ్చెను. ప్రస్తుతము రామదాసు సంకల్ప మటుండనిచ్చి శివాజీని గుఱించి కొంత విచారింతము. శివాజీ గర్భస్థుడై యున్నప్పుడు శివాజీ తండ్రి, షాజీ, శివాజీ తల్లిని నిరాదరణచేసి దు:ఖముల పాలుచేసెను. ఆమె తండ్రియైన యాదవరావు లుకజీ రాజకీయ సమస్యలలో నల్లుడైన షాజీతో నభిప్రాయభేదములు కలిగి యితనితో విరోధము పెట్టుకొనెను. షాజీ యింటిపట్టు విడిచి యొక స్థలము నుండి వేఱొక స్థలమునకు బాఱిపోజొచ్చెను. మామ యల్లుని వెంట