ననుకూలురో యెవరు ప్రతికూలురో యేవిధముగ వారిని సమీపింపవలెనో యెత్తెఱంగున దన విధి నెఱవేర్చవలెనో శిష్యుడు తెలిసికొనదగిన యవకాశము గలుగును. ఏ కార్యమైనను నా దినమున జేయదగినది మరునాటివఱకు నిలుపు చేయగూడదు. గురువుగారి మార్గమునే శిష్యుల ననుసరించుట చేత శరీరము నీటిబుగ్గవలె క్షణభంగుర మని తెలిసికొని యెప్పటికార్య మప్పుడు చేయుచుండిరి. ముందు నిముషము నందేమి సంభవించునో మన మెఱుగము గాన నిరంతరము రామనామ స్మరణము చేయుచు శిష్యులు స్వకార్యదీక్షాపరతంత్రులై యుండిరి. ఏకాంత స్థలమున కరిగి ధ్యానము చేయుచుండవలెను. ఆ ధ్యానమువలన మనశ్శాంతియు నసాధారణ ధైర్యము కలుగును. మహారాష్ట్ర దేశ మంతయు నధోగతిలో పడిపోయినప్పుడు రామదాసు సింహమువలె గర్జించి బలిష్టమైన తన హస్తమును వారికందించి వారి నా బురదనుండి లేవనెత్తెను. కష్టము లేకుండ ఫలము లభింపదు. పరిశ్రమ లేకుండ స్వరాజ్యము చేకూరదు. కార్యశూరత్వము లేక నే లాభము గలుగదు. కర్మము విషయమై శ్రీకృష్ణ భగవాను డేమి చెప్పెనో మన మెఱుగుదుము. పనికే కర్మ యని పేరు. కర్మ చేయక నెవడును నుండలేడు. ఏలయన వినుట కర్మ, చూచుట కర్మ, నడచుట కర్మ ఏ పనిని జేయక యుండుట స్వలాభ విరుద్ధము. తాను స్వయముగ బని చేయక యితరుల నమ్ముకొన్నవాడు పరమ మూర్ఖుడు అని చెప్పెను. రామదాసుడు శ్రీకృష్ణభగవానుని వాక్యములే నొక్కివక్కాణించి శిష్యులను బనికై పురికొల్పెను. కార్యదీక్ష లేకుండ నెట్టి కార్యములు నెఱవేరలే దని చరిత్రయే సాక్ష్యమిచ్చుచున్నది. పరోపకారము నీతియు బ్రధానముగా నుంచుకొన వలసిన దని రామదాసు తన శిష్యులకు పలుమారు బోధించుచు వచ్చెను. శరీరమును నీతిమార్గమునకు ద్రిప్పినవాడును, నాత్మ నశింపక శాశ్వతముగ నుండునని నమ్మినవాడును మరణ మన్న లేశము భయపడడు. పేరు ప్రతిష్ఠలకొఱ కేపనిని చేయవద్దని రామదాసుడు తన శిష్యులను గఠినముగ శాసించెను. మనుష్యుడు ఫలాపేక్ష లేక నిష్కామకర్మ చేయవలెను. కష్టపడి పనిచేసిన వారికి సుప్రతిష్ఠ దా నంతట యదే వచ్చును. మానవుడు తన దారాపుత్రాదులను
పుట:SamardaRamadasu.djvu/54
స్వరూపం