పుట:SamardaRamadasu.djvu/46

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మేధావి యనియు లోక మెఱుంగును కదా! పిల్లలకు భూత భేతాళ పిశాచములు సోకకుండ హనుమద్విగ్రహముచెక్కిన బిళ్లలు బిడ్డల మెడలలో వ్రేలాడుచుండుట మన మెఱుంగుదుము. శ్రీరామునివలన యోగవిద్యను హనుమంతు డుపదేశము పొందినట్లు 'సీతారామాంజనేయము' అను గ్రంథములో నున్నదిగదా! భారత యుద్ధములో గౌరవులను జయించుటకై యర్జునుడు తన ధ్వజము మీద హనుమంతుని విగ్రహము నిలుపు కొనినట్లు మహాభారత యుద్ధపర్వములో ననేకచోట్ల జెప్పబడి యున్నది. ఒక జాతిని బలసమేతముగాను మహోత్సాహవంతముగాను జేయుటకై యాతని యందే శక్తికల దని రామదాసుని నమ్మకము. ఆ దేవుని యొద్ద మూడు శక్తులు కలవు. అవి యేవనగా నొకటి దేహశక్తి. రెండు మనశ్శక్తి. మూడు ఆత్మశక్తి. దుష్టభూయిష్ఠ మైన ప్రపంచము దేహశక్తి వల్లనే లోబఱచుకోవలెను గదా! దేహశక్తి లేనియెడల జనులకు స్వాతంత్ర్యముగాని శాంతిగాని సౌఖ్యముగాని స్వప్నవార్తలు గదా. ఇతర శక్తులెన్ని యున్నను దేహశక్తి లేకున్న నవి, యన్ని నిరర్థకములుగానె, దృడమైన మనశ్శక్తి లేకపోయిన యెడల నీ దేహశక్తి కేవలము పశుబలముగ బరిణ మించును. దేశమును నాగరికముగ నుంచుటకు గ్రమపద్ధతిగ నడుపుటకు, దేహబలముతోపాటు మనోబలము జ్ఞానబలము కూడ నుండవలెను. దేహబలము, మనోబలమే మానవ జాతియొక్క యభ్యుదయమునకు జాలునని యీ నాటివారి నమ్మకము.

కాని పాశ్చాత్య మతమునకు మన ప్రాచ్యమతమునకు నీ విషయమున విశేష భేదము కలదు. దేహ మనశ్శక్తు లాత్మశక్తితో గలసియుండని యెడల బ్రపంచము పశుబలమున కధీనమై నానాబాధలు పడవలసి వచ్చును. అందు చేతనే ప్రాచ్యదేశస్థులైన మహర్షులు పరమోత్కృష్టమైన యాత్మశక్తి మొట్ట మొదటిదిగాను, దేహ మనశ్శక్తు లప్రధానములుగాను బరిగణించిరి. మారుతి నాదర్శ దైవతముగ బెట్టుకొన్న యెడల దమ దేశస్థుల కీ మూడు శక్తులు చులకనగ నలవడు నని రామదాసు యొక్క నిశ్చితాభిప్రాయము. భగవంతుని యారాధనము మొట్టమొదట జేసి పిమ్మట దేశ రాజ్యాంగ విషయములు చూచుకొన వలెనని రామదాసు బోధ. మన జీవిత