పుట:SamardaRamadasu.djvu/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేసిన యోగీశ్వరుం డితడా యని యక్కజంపడి యా మాట విశ్వసింప జాలక చిత్తమున గలత నొందుచు వచ్చిరి. ఆడంబర శూన్యమై వెడగుదనమును సూచించుచున్న యా శరీరములో దేశము నందలి యజ్ఞా నాంధకారమును బటాపంచలుగ విఱియ జేయునట్టి తేజోరాసి యున్నదని సామాన్యు లూహింప లేకపోయిరి. కాని, యతని ముఖమందలి తేజస్సును జూచిన వారును, వానితో నొక్కసారి మాటలాడునట్టి భాగ్యము గలిగిన వారును, సామాన్యు లట్లు గాకా వాని మహత్ప్రభావమును గుర్తెఱింగిరి. బాహ్యమైన యా నిరాడంబర జీవితమును గుఱించి రామదాసుడు డిట్లు చెప్పుచుండెను.

"మన పై వాలకము పిచ్చివానివలె నుండవలెను; కాని మన హృదయములు బహువిధ ధర్మమార్గములతో నిండి యుండవలెను. కాని మనతో గలసి మెలసి యుండు జనుల యొక్క మైత్రి మాత్రము చెడకుండునట్లు జాగ్రత్తపడవలెను."

ఆతడు పైకి దిగులు జెందినట్లు, విచారపడుచున్నట్లు గనబడు చున్నను లోలో నతడు మహానందమున నోలలాడుచు నిరంతరము పరమేశ్వరపాదధ్యానము చేయుచుండుటచే సుఖపడుచునే యుండెను.

అతనినోట వెడలిన ప్రతియొక్కమాట యమృతపు సోనవలె జనులను సంతోష సముద్రమున దేల్చును. అందుచే జనులు తమ కెట్టిట్టి పనులున్నను వాటిని విడిచియైన వారి దర్శన మొకసారి చేసి వారి పలుకులు వినవలెనని కోరుచుందురు.

కాని, యత డెక్కడను గనబడడు, కనబడెనాయెంతో దు:ఖమున మునుగినవానివలె గనబడుచుండును. ఈ వర్ణనలనుబట్టి యీనాటి మనవారు మంచిపాఠము నేర్చుకొనవచ్చును. మనుష్యులు తాము గొప్పవారు గాక సామాన్య మనిష్యులయి యున్నప్పడే మిక్కిలి గొప్పవారనిపించు కొనవలెనని యొక దురుద్దేశ్యమునకు లోనై యున్నారు. అట్టి దురభిప్రాయమును వారు రామదాసుని చరిత్రము జదువుకొన్న తరువాత