పుట:SakalathatvaDharpanamu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. 3. మనస్సుచేత జేయబడిన మిశ్రకర్మ నిర్వికల్ప సవికల్ప సమాధులు మొదలయినవానియందు విషయచింతయు, పరద్రోహచింతయు మొదలయినవి మనస్సుచేత జేయబడిన మిశ్రకర్మము లనబడును.

వాక్కుచేత జేయబడిన పుణ్యకర్మ వేదశాస్త్ర గీతానామసహస్ర పఠనంబును, గాయత్ర్యాది మంత్రజపంబును జేయుట వాక్కుచేత జేయబడిన పుణ్యకర్మ యనంబడు.

2. వాక్కుచేత జేయబడిన పాపకర్మ పెద్దలను దూషించుటయు, అసత్యములుబలుకుట మొదలుగాగలవి వాక్కుచేత జేయబడిన పాప కర్మము.

3. వాక్కుచేత జేయబడిన మిశ్రకర్మ వేదాధ్యయన జపాదికాలములయందు లౌకికవార్తయు, ప్రమాణములు మొదలయినవి జేయుట వాక్కుచేత జేయబడిన మిశ్రకర్మము లనబడును.

కాయముచేత జేయబడిన పుణ్యకర్మ పుణ్యతీర్థస్నానంబును, గురుదేవతానమస్కారంబును, బ్రహ్మచర్యంబు మొదలయినవి కాయముచే జేయబడిన పుణ్యకర్మ మనంబడును.

2. కాయముచే జేయబడిన పాపకర్మ పరులపీడించుటయును, పరస్త్రీసంగమము, పరిధనహరణము మొదలైనవి కాయముచే జేయబడిన పాపకర్మ మనంబడు.

3. కాయముచే జేయబడిన మిశ్రకర్మ పరులను బాధించి వారల ద్రవ్యంబు దీసుకొని దేవాలయములు మొదలయినవాటికి ఖర్చుపెట్టుట కాయముచే జేయబడిన మిశ్రకర్మ యనంబడు.

యెల్లప్పుడు కరణత్రయముచేత పుణ్యకర్మంబే చేయవలయు, లేదా మిశ్రకర్మమునైనా జేయవలయునుగాని పాపకర్మము ఒకప్పుడు జేయగూడదని బుధజనాభిప్రాయము.

7. అంగత్రయము.

స్థూలాంగము, సూక్ష్మాంగము, కారణాంగము యీ 3 న్ను అంగత్రయ మనబడును.

ఇదియే శరీరత్రయము మొదలయిననామములచే చెప్పబడును.

స్థూలాంగము:- పంచవింశతి తత్వములతో కూడి స్తంభమువలె కనుపడుచున్నది స్థూలాంగ మనబడును.