Jump to content

పుట:SakalathatvaDharpanamu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4 కార్మికమలము:- పుణ్యపాపములచేత స్వర్గనరకములున్ను, జననమరణములున్ను గలవని నిశ్చయించుకొని కర్మశీలుం డగుట కార్మికమల మనంబడును. (అని సకలార్థగురుబోధసారము.)

ఈమలత్రయము జ్ఞానమునకు ప్రతిబంధము. గనుక, సర్వావస్థల యందును బుద్ధియం దెక్కనీక తోసివేయవలయునని శాస్త్రసిద్ధాంతము.

4. ఇచ్ఛాత్రయము.

స్వేచ్ఛా, పరేచ్ఛా, అనిచ్ఛ యీ 3 న్ను యిచ్ఛాత్రయ మనంబడును.

స్వేచ్ఛ:- తాను వకకార్యమును మనస్ఫూర్తిగా కోరి చేసి దాని వలన వచ్చిన సుఖదు:ఖముల ననుభవించుట స్వేచ్ఛ యనంబడును.

సరేచ్ఛ:- తాను వకకార్యమున్ను కోరి చేయక పరులచే ప్రేరేపింపంబడి చేసి అందుచే గలిగిన సుఖదు:ఖముల ననుభవించుట సరేచ్ఛ యనంబడును.

అనిచ్ఛ:- తాను వకకార్యమున్ను కోరిచేయక పరులచేతనున్ను ప్రేరేపింపంబడిచేయక దైవీకమువల్లవచ్చిన సుఖదు:ఖములనను భవించుట అనిచ్ఛ యనంబడును.

జ్ఞానికి స్వేచ్ఛ నీచ మనిన్ని, సరేచ్ఛ మధ్యమ మనిన్ని, అనిచ్ఛ వుత్తమమనిన్ని వేదాంతసిద్ధాంతము.

5. కర్మత్రయము.

పుణ్యకర్మము, పాపకర్మము, మిశ్రకర్మము యీ 3 న్ను కర్మత్రయ మనంబడు.

6. కరణత్రయము.

మనస్సు, వాక్కు, కాయము యీ 3 న్ను కరణత్రయ మనబడును. ఈకరణత్రయముచేత మొదటికర్మత్రయము జేయబడుచుండును,

మనస్సుచేత జేయబడిన పుణ్యకర్మ సవిశేష నిర్విశేష చింతయు, భక్తిజ్ఞానవైరాగ్యచింతయు, పరోపకారము మొదలయినవి మనస్సుయందుండుట మనస్సుచేత జేయబడిన పుణ్యకర్మ మనబడును.

2. మనస్సుచే జేయబడిన పాపకర్మ సర్వదా విషయచింతయు, పరులకుద్రోహము జేయగోరుటయు, పరలోకము లేదనుటయు యీ మొదలుగాగలవి మనస్సుచేత జేయబడిన పాపకర్మములు