Jump to content

పుట:Sakalaneetisammatamu.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నధికుతోడ యుద్ధంబు సేయుట కొండతోడఁ దగరు దాఁకినయట్ల యపజయంబు సిద్ధంబు. సముం దొడరినఁ బచ్చికడవ పచ్చికడవం దాఁకినయట్లు జయం బసాక్షికంబు. శూరుండు నుపాయవేదియునైనవానిని వాఁ డల్పుండైనను మిత్రుఁ జేయునదిగాని తెగవలదు, శూరబలం బల్పంబయిన గెల్చునుపాయవేది శూరుండు గాకయు గెలుచు ననిన వేఱ చెప్పనేల. పరుండు సాధ్యుఁడు గా నిశ్చయించి యతని సహాయుల నుపాయంబునఁ బాపి యతనిదాయాదుల నేమి యిచ్చియైనఁ దొలగించి మఱియు ననేకప్రకారంబుల నదృష్టదూరార్థసాధకం బగు ప్రజ్ఞాశస్త్రంబులన యుద్ధంబు సేసి యింక యిట్లనియున్న హాని యగువేళ నాసన్నదృష్టార్థసాధకం బగు శస్త్రయుద్ధంబు సేయునది. కార్యవేళ యెఱుంగ కుపక్రమించుట నీరు గానకమున్నె చెప్పు లూడ్చినట్లు. అవశ్యంబునం గెలుచువానికి దైవబలంబును గలుగు. అని యెల్లసంధులఁ గాక శకున స్వరభూమి గ్రహాదిబలంబులు గలవేళన యుపక్రమింపవలయు. పొడుపునకుఁ బిఱుకులం గూర్చిన బలంబు లెల్ల వెఱతురుయ శూరులకైనను దాఁకుదలతెచ్చుట జయకారణంబు. మున్ను రణంబునఁ గని యెఱుంగనివారు పరులసామర్థ్యం బెఱుఁగకైనను సర్వపదావిరుద్ధంబుననైనను వీరాలాపంబులు పలికిన నమ్మవలదు. మఱియును. 985

ఆ. ఆహవేచ్ఛలేనియతని నాయతపాటు
లేనివాని భీతుఁ డైనవాని
యుద్ధకృత్య మొల్ల కున్నవానిని జంపి
నతనిఁ బొందు బ్రహ్మహత్య యనిరి. 936

క. యుద్ధమున గెల్చి రిపుచే
నెద్ధన మెవ్వాఁడు దెచ్చె నేర్పడఁ బతి యం
దుద్ధారము గొన కాతని
కద్ధన మంతయును నిచ్చునది ధర్మమతిన్. 937

క. ఇత్తెఱఁగు దెలిసికొని దం
డెత్తి చననిరాజు పరమహీశుల సిరు లు
ద్వృత్తిగొను నెట్లు సేకొను
గృత్త్రిమనయమతము లేక కేశవనాథా. 938

మదీయము



ఆ. సింహవృత్తిఁ దాల్చి చేకొనవలయుఁ దా
సద్వివేకనృపతి శత్రులక్ష్మి
నధికదుర్వినీత లగు కామినులఁ గచ
గ్రహణ మమరఁ జేసి కవసినట్లు. 939

పంచతంత్రి