పుట:Sakalaneetisammatamu.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. నరులకు నెచటికి నరిగిన
మరణము నిజ మగుట యెఱిఁగి మనుజుఁడు సమర
స్ఫురణంబు విడిచి వెనుకకు
నరిగిన నపకీర్తి దక్క నన్యము గలదే. 931

ఆ. చచ్చు నూర కొకఁడు జావఁ డొక్కఁడు పోటు
లెన్ని సోఁకియైన నింత యెఱిగి
మున్ను నడచి కీర్తిఁ జెన్నఁగు టొప్పదే
దైవఘటన కేల తలఁక నరుఁడు. 932

నీతిసారము



గీ. సమర మొనరించినంతనె చావురాదు
పాఱిపోయినంతనే బ్రతుకు లేదు
యెటులఁ బోవుప్రాణ మిచ్చియు రణమున
పతిఋణంబు తీర్పఁ బాఁడిగాదె. 933

ఆ. చచ్చెనేని యోగిచాడ్పున ముక్తికి
పాఱిపోయినయంతనే బ్రతుకు లేదు
బ్రతికెనేని యుభయబలములుఁ బొగడంగ
నుండు సమరకేళి యొప్పదెట్లు. 934

మార్కండేయము

వ. మఱి యుద్ధంబు నిరూపింతు నదియును సంకులద్వంద్వైకాకిభేదంబు లన మూఁడు దెఱంగు లందు ద్వంద్వైకాకియుద్ధంబులు మత్సరగ్రస్తులగు వీరభటులపని గాని రాజకృత్యంబులు గావు. సంకులంబునకుఁ గరికోటచతురంగయుద్ధంబు లన మూఁడు భేదంబు లందును జొచ్చిపోయి పోరుట కరియుద్ధంబు, దుర్గంబుమీఁద విడిసి పోరుట కోటయుద్ధంబు, బయలం జతురంగబలంబులం బన్ని యుద్ధంబు సేయుట చాతురంగంబనంబడు. నివి క్రమంబున నధికునందును హీనునందును నధమునందును బ్రయోగించునది, యధికుం డెత్తినఁ గార్యోపాయంబున వేలంబు సొచ్చి పొడుచుటయు ననువైన దుర్గంబు కల్లకోటగోడ గొనుటయు సంధికి నుపాయంబులు; హీనుండగువాని దుర్గంబుమీఁద విడిసి మహాయత్నంబున బహుయంత్రతంత్రకార్యంబుల గొనుట యుచితంబు, సముతోడ బయలఁ బోరునప్పుడు బలు వెఱుంగని నరుగొంత మిగులం జూచి కాని యుపక్రమింపవలదు దైవమానుషంబు కలిమి యధికశక్తి యనంబడు. చతురుపాయషాడ్గుణ్యవేదియు బలశక్తిసంపన్నుడును నూతనానితరసాధనోపేతుండును నయ్యును బయల