పుట:Sakalaneetisammatamu.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ. దొడ్డవానితోడఁ దొడరి యూరకయుంట
కసపుకుప్పఁ జిచ్చు గలుగఁబెట్టి
దానిక్రిందఁ గాలఁ నిద్రపోయిన
వానిభంగి గాదె వసుధలోన. 911

నీతిసారముక. ఘనుఁ డెత్తి వచ్చి విడిసిన
తన కోటయె హీనుఁ డెలమి తగుసుహృదుల రాఁ
బనిచిన యుక్తం బగువా
రును దానును దోల నదియుఁ గ్రొవ్వియ చచ్చున్. 912

మ. తనకున్ గెల్వఁగరానిపక్షమున వే తా వైరిఁ బోకార్చఁగా
ఘనశత్రుం దలపెట్టఁగావలయు వేగం బొప్ప నీతిజ్ఞుఁ డె
ట్లనినన్ వాఁడును బోరఁగా నిహతుఁ డౌ నట్లైన నప్పిమ్మటన్
దనవైరంబు నడంగదయ్యె దొడలుండన్ ......కున్ సైన్యముల్. 913

ఆ. ఒలియుఁ డగుశత్రుచేతనఁ బలియుఁ డనఁగఁ
బేర్చుశత్రునిఁ బచ్చి వైపింపవలయు
మూలనాశంబుగాఁ దన్ను మోవకుండఁ
బెలుచ ములుముంటఁ బుచ్చి వైపించినట్లు. 914

క. పొగడఁదగుసహజసత్త్వుం
డగు నెవ్వఁడు వాఁడు వొలియఁ డహితులచేతన్
జగతిమణిదీపశిఖ కడు
నిగుడుం గా కడఁగిపోవునే పెనుగాలిన్. 915

పంచతంత్రిక. వెఱపించి చూచి యెందును
వెఱవకయున్నతనిఁ జేర వెఱతురు మదిలో
వెఱచినఁ దాఁ బైపడగాఁ
నుఱుకుం గుక్కయును గ్రోతియును బగవాఁడున్. 916

పురుషార్థసారముచ. విను మును నీతియుం గలదు వేయును నేటికి దర్ప మేర్పడన్
అని యొనరింపఁ గావలయు నారగ నుత్తమునందు సామమున్
బెనుపఁగ శూరునందుఁ గడుభేదము నల్పునియందు దానమున్
విను సమునందుఁ బౌరుషము నేర్పునఁ జేసిన జాల మే లగున్. 917

పంచతంత్రి