పుట:Sakalaneetisammatamu.pdf/220

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. తా నరులు వచ్చు తెరువున
మానుగఁ గలచెఱువులందు మడువులయందున్
బూని ఘనగరళతరళము
గా నొనరింపంగవలయుఁ గడువేగమునన్. 918

ముద్రామాత్యముగీ. ఎత్తినప్పుడు విడియుచో నిఱుకటంపుఁ
దెరువునందును నడ చెడి తిరుగఁబట్టి
నట్టియెడ నిద్రపోయెడునవసరమున
శాత్రవుల బిట్టు పైఁబడి చంపవలయు. 919

వ. ఇ ట్లుభయబలంబులుఁ గదియునప్పుడు. 920

సౌప్తికపర్వముక. ముందటను భటులు భటుల పి
ఱుందను రథములును నప్పిఱుందను హయముల్
బొంద నటపిఱుద గజములు
నందంబుగ నిట్లు మిశ్ర మచలం బనఁగన్. 921

కామందకముక. వికటపటుశూలకళితా
శకటోద్భటగజఘటాదిచక్రవ్యూహ
ప్రకట మొనరింపఁగాఁ దగు
నకుటిలభుజదర్ప మొప్ప నాహవభూమిన్. 922

ముద్రామాత్యముసీ. గట్టును జెట్టును మిట్టయు బల్లంబుఁ గలిగినచోటు కాల్బలమునేల
వినుము నీళ్ళును రొంపియును లేక సమవిశాలము నైనచోటు గుఱ్ఱములనేల
క్రమ్మి గ్రుంగక గదగదగువంపులు గలుగమి నొప్పుచో టరదములనేల
యెడనెడ మ్రాఁకులు మడువులు గలచోటు కురునాథ యెఱుఁగుము కరులనేల
ఆ. యేబలంబు దనకు నెక్కుడు గలుగు న
బ్బలమునేల పోరు గలను గాఁగ
నినుఁడు శశియు గాలి వెసుకగా మొన నడ
పించి పొదువ సంభవించి జయము. 923

శాంతిపర్వము