Jump to content

పుట:Sakalaneetisammatamu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

నూషపాషాణశర్కరాత్యుగ్రరూక్ష
భుజగ కంటక తస్కరభూరివిపిన
సంకులం బగుభూమి యసంఖ్యమైన
నేఫలం బగు భూమి నరేశ్వరునకు.

65


సీ.

భూరిభూమీగుణంబుల నుల్లసిల్లుచు
             నానూపము బర్వతాశ్రయంబు
నానావిదేశజనస్తోమధామము
             దనుపక బహులము ధర్మయుతము
శూద్రకారుణవణిక్ప్రచురపురాంతరము
             నుచితమహారంభకృషీవలంబు
రాజానురాగ మరాతివిద్వేషియుఁ
             బీడాకరసహంబుఁ బృథుతరంబు


ఆ.

నైన మండలంబునందు నృపాలుండు
వ్యసనమౌర్ఖ్యహీనుఁ డగుచు నెపుడు
న్యాయమార్గవృత్తిఁ బాయక పోషింప
వలయు నదియు సర్వవర్ధనంబు.

66

కామందకము

క.

ధరణీనాథ భవద్భుజ
పరిపాలిత మైన వసుధ పరిపూర్ణములై
కర మొప్పుచున్నె చెఱువులు
ధరణి కవగ్రహభయంబు దగులకయుండన్.

67

సభాపర్వము

చ.

వెస నతివృష్టియున్ మఱి యవృష్టియు మూషకముల్ పతంగముల్
మసఁగు టశోభనంబు కృపమాలిన దండువు శత్రుసైన్యముల్
ఎసగిఁ యరాతితస్కరు లధీశచమూప్రియు లేచి నొంపుటల్
పసులును మానవుల్ రుజలఁబంచత నొందుట రాష్ట్రదోషముల్.

68


శా.

ఆదానాధికమున్ మితవ్యయము ప్రఖ్యాతేప్సితద్రవ్యమున్
మోదారాధితదైవతోర్జితము సన్ముక్తాదిరత్నాఢ్యమా
హ్లాదశ్రీకర మాత్మరక్షణవిధాయత్తంబు పైతామహా
నాదిప్రౌఢమునైన పెన్నిధి ధనంబై యొప్పు నక్షీణమై.

69


గీ.

ధర్మకామార్థలాభవిధానమునకు
సకలభృత్యాదిలోకరక్షణముకొఱకు
నాపదర్థము నర్థరక్షాపరుండు
గా నవశ్యము వలయు భూకాంతుఁ డెపుడు.

70


గీ.

ఇట్టిసంపద నెంతయు నేర్పు మిగులు
దుర్గములు భూములునుఁ గడు దోరముగను
లేని భూపతి వాత్యావిలూనవికట
వికలకాదంబినీసమవిభవుఁ డగును.

71


ఆ.

పరఁగ నాత్మరక్షఁ బరపక్షపూజ్యుఁ డౌఁ
బూని దుర్గసంస్థుడైన విభుఁడు
ఇట్టి దుర్గమునకు నెంతయు వ్యసనంబు
పొడమెనేని చేటు గడమలేదు.

72