పుట:Sakalaneetisammatamu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

ధరఁ దృణకాష్ఠతైలఘృతధాన్యబలాదికవస్తుపూర్ణమై
గురుతరమై మహాటవులఁ గోటల భూరిగభీరవాపులన్
బరివృతమై ప్రవీరసులభం బగు దుర్గము గల్గు ధారుణీ
శ్వరుఁడు దలంప నెవ్వరి కసాధ్యుఁడు వారికి సాధ్యులే యొరుల్.

58

పురుషార్థసారము

క.

రసరాజ మైన లవణం
బెసగఁగ దుర్గముల సంగ్రహింపగవలయున్
బొసఁగునె యన్నము మఱి యే
రసములు గలిగినను లవణరసవర్ణితమై.

59


సీ.

బలుగాఁపు వాకిళ్ళఁ బగలు రేయును నిడి
             కోటపాళెము తగుచోటఁ బెట్టి
కనుమపట్లను నెల్లఁ గావలి నియమించి
             నడిమిచావిడిఁ దగునరుల నునిచి
నగరిచుట్టును బారి నడిపించి క్రంతలఁ
             దిరుగుచుండగఁ దలవరులఁ బనిచి
దినచర్యఁ బాలెముల్ దృష్టివెట్టుచు రేలు
             దివియలు విడువక తిరుగఁజేసి


ఆ.

దొరల రాజులందు నరయుచు భటులందు
భేద మొదవకుండ నాదరించి
యుచితవృత్తి గావకుండిన దుర్గంబు
నేలఁగలఁడె భూమి నింద్రుఁ డైన.

60


క.

బలు వగు దుర్గము గలిగియు
బలములు లేకున్న నిలుప బలవంతునకున్
దలమే నృపులకు నాలుగు
బలములు గలుగుటయె కాదె బలిమి యనంగన్.

61


క.

కరులును హరులును రథములు
వరభటులు ననంగ నాల్గు వర్గంబులు నొం
డొరులకుఁ బ్రాపై నిలువక
పరసేనం గెలువగలఁడె పార్థుం డైనన్.

62

నీతిసారము

క.

ఈ నాలుగుదుర్గములకు
మానుగఁ జొర వెడల గూఢమార్గము వలయున్
ఆనూపజాంగలంబులఁ
బూనిన భూములును వలయు భూనాథునకున్.

63


క.

భూగుణముచేత రాష్ట్రము
భోగాస్పదవృద్ధినొందుఁ బొదవినరాష్ట్ర
శ్రీగరిమం బది పొదలు స
రాగము లామంచిభూమి రాజున కెందున్.

64


సీ.

సస్యాకరవిశేషసలిలసమృద్ధియుఁ
             బణ్యఖనిద్రవ్యబంధురంబుఁ
బుణ్యదేశాన్వితంబును గోహితంబును
             గుంజరోద్భవవనపుంజములును
వారిస్థలపథాన్వితారూఢమును నదీ
             మాతృకంబును సేవ్యమానతలము
నై పొలుపొందుట యవనీస్థలంబున
             కంచితగుణములై యతిశయిల్లు