పుట:Sahityabashagate022780mbp.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మైన ప్రయోగాలుకూడా అప్పటప్పట చెయ్యవచుననేది ఒక పాయ. రెండుకూడా ఆరోహవరోహణములతో కాలప్రవాహం వెంట తెలుగు సాహిత్య భాషలో వస్తూనే ఉన్నాయి.

ఆధునిక యుగం గడపమీద

     19వ శరాబ్ది ప్రారంభంనుండీ ఆధునిక యుగంగా పరిగణించ వచ్చును.  ఈ సమయానికి బ్రిటిషువారి పరిపాలన భారతదేశపు మొత్తంమెద ఆంధ్రదేశంలోనూ కూడా స్థిరమైన పునదులపై నిలిచింది.  విదేశ ప్రభుత్వంతోపాటు క్రైస్తవ మిషనరీలు కూడా తమ కార్యకలాపాలను విస్తృతం చెయ్యడం మొదలు పెట్టారు.  క్రైస్తవ మత వ్యాప్తి కోఫ్సమూ, విదేశీయులను ఆ మతానికి పరివర్తనం చెయ్యడం కోసమూ, బైబిలు అనువాదం చెయ్యడానికి మిషనరీలు పూనుకొన్నారు. ప్రభుత్వ యంత్రాంగంల్లో కూడా ఆంగ్లోద్య్జోగులకు తెలుగు నేర్వవలసి వచ్చింది.  కోర్టుల్లో వ్యవహరం నడిపించడానికి, దస్తావేజులు, అర్జీలు మొదలైన చదవగలగడానికి వారికి తెలుగుతో పని పడింది.  పాశ్చాత్యులు సులభంగా తెలుగు నేర్చుకోడానికి తెలుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులు సమకూర్చడమూ, తెలుగునకు ఇంగ్లీషులో వ్యాకరణాలు వ్రాయడమూ ముఖ్యంవసరమైంది.  కాంబెలు, విలియం బ్రౌను మొదలైన వారు నిఘంటు నిర్మాణం ఛేశారు.  వీరందరిని మించి తెలుగు విషయంలో కృషిచేసినవారు చార్లెసు ఫిలిప్ బ్రౌను దొర. ఈయన ఇంగ్లీషు-తెలుగు, తెలుగు-ఇంగ్లీషు నిఘంటువులూ, వ్యాకరణము, వాచకములు మొదలైన పెక్కు రచనల్ ఛేశారు.  తెలుగువారికి ఈ నిఘంటువుల్లోను వ్యాకరణాల్లోను క్రొత్త పద్దతి కనబడింది.   మన పూర్వ నిఘంటువులు సంస్కృతంలోనైనా తెలుగులోనైనా శ్లోక అద్యరూపంలో ఉండేవి.  ఇప్పుడు 'అ 'కారాది వర్ణక్రమంలో శబ్దాలు కూర్చడమూ, వాటికి అర్ధాలు వచనంలో సర్వజన  సులభమైన భాషలో వ్రాయడం పాశ్చాత్యులు చేస్తూ వచ్చారు.  వ్యాకరణయుక్తమైన భాషకే కాక వ్యహారంలోనూ బజారుల్లోనూ మాట్లాడే భాషకు కూడా వ్యాకరణాల్లో స్థానం దొరికింది.  ఇది మన వారికి క్రొత్త, ఇప్పటి నుంచీ మద్య ప్రయోజనం తక్కువ అయి వచనము ప్రయోజనము అధిక మయింది.  దీనికి కారణము ఆంగ్లేఉలు ప్రవేశ పెట్టిన విద్యా పద్దతి. పాలకుల రాజకీయావసరాలను బట్టి దేశీయులు ఇంగ్లీషు అభ్యసించవలసి వచ్చింది.  విద్యాప్రణాళికలో ఆంగ్లమునకు ప్రధమ స్థానం ఇవ్వడమయింది. పూర్వంమల్లే అత్గ్రవర్ణాల వారు, కొద్దిమంది సంపన్నులు మాత్రమే విద్యార్జనకర్హులు అనె భావం పోయింది.  సార్వజనిక