పుట:Sahityabashagate022780mbp.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

67

విద్యావుదానం అమలులోకి వచ్చింది. పఠనీయాంశములుకూడా మారినాయి. మహాకవుల గ్రంధాలు చదివి అర్ధం చెప్పడంణ్తో విద్యావిధానము పూర్తి అవదని గుర్తించారు. వ్రాయడం, చదవడం, లెక్క్జలు, చరిత్ర, భూగోళము వంటి విషయాలు పాఠ్యాంశములు అయాయి. పూర్వం లెక్కలు కూడా పద్యాల్లోనే ఉండేవి. పావులూరి మల్లన గణితం ఉదాహరణగా తీసుకోవచ్చును. పిల్లలు చదివే వాచకాలు వ్రాయించ వలసి వచ్చింది. అచ్చు యంత్రం వచ్చినప్పటినుంచిఈ పుస్తకాలు ప్రచారంలోక్ వచ్చాయి. జనులు అధిక సంఖ్యలో పుస్తజ్కాలు చదవగోరుతున్నారు. వీరంతా భాషా పండితులు కారు. జన సామాన్యం వివోదం కోసం చదువగోరిన కధల పుస్తకాలు యాత్రాకధనములు వ్రాయించవలసిన అవసరం ఏర్పడింది.

   ఇటువణ్ంటి విస్తృత ప్రయోజనాలదృష్ట్యా పద్యాత్మక కావ్యాలు వెనుకబడ్డాయి.  వచనగ్రంధాల ప్రాముఖ్యం హెచ్చింది.  యావన్మందికీ అందుబాటులో ఉండవలసిన వివిధ రకముల పుస్తకాలు ఏభాషలో వ్రాయాలి అనే సమస్య రచయితల్ని ఎదుర్కొంది.  ఆంగ్లేయులు సహజంగానే తెలుగు వ్యవహారభాషలో వ్రాయాలని భావించారు.  తెలుగు పండితులుకూడా సర్వజనోపయోగియైన పుస్తకాలు శిష్ఠవ్యవహార భాషలో వ్రాయడం మొదలు పెట్టారు.  రావిపాటి గురుమూర్తి శాస్త్రిగారివంటి పండితులు కధల పుస్తకాలు వ్యవహారభాషలో వ్రాయడం సదాచారంగానే పరిగణించారు.  ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్రా చరిత్రవంతివి వ్యవహరభాషలో వెలువడినాయి.  దీనికి పూర్వప్రాతిపదిక లేకపోలేదు.  పూర్వంనుంచీ వ్యాఖ్యాన గ్రంధాలు, వివరణలూ శిష్టులు వాడే వ్యవహారికంలో వ్రాసే సంప్రదాయం ఉండేరి.  శాసనాల్లోనూ, దస్తావేజులు మొదలైన వాటిల్లోనూ వ్యవహారభాష మాత్రమే నడిచేది.  ఎటొచ్చీ పద్యకవ్యాలు మాత్రం సలక్షణభాషలోనే వ్రాసేవారు.  పద్య కావ్యాంతర్గతమైన గద్యభాగంకూడా సలక్షణభాషలోనే ఉండేది.
    ఇంతలో 1850 ప్రాంతంలో భాషావేతయూ మహావిద్వాంసుడూ అయిన పరవస్తు చిన్నయసూరి విశ్వవిద్యాలయరంగంలో అడుగుపెట్టాడు.  ప్రామాణికమైన వ్యాకరణ్ రచనకోసం ఈయన ఎన్నియో పధకాలు వేసుకొని చివరకు వాటన్నిటి సారభూతమైన బాలవ్యాకరణం రూపొందించాడు.  బాలవ్యాకరణం పుట్టిన వేళావిశేషం ఎటువంటిదోకాని అది అచిరకాలంలోనే పండితులకు తలలో నాలుకవంటిది అయిపోయింది. పూర్వ వ్యాకరణరీతులను స్తుతించేవారికి నిందించేవారికి కూడ బాలావ్యాకరణమే  ఆలంబనం అయింది. చందస్సు విషయంలో అప్పకవీయంలాగ, తెలుగు చంద్