పుట:Sahityabashagate022780mbp.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

65

మాత్రము భిన్నుడై చంద్రికా పరిణయంలో తొల్గింటి వసు చరిత్ర ప్రౌఢశైలికి మొగ్గి నాడు. ఈ కాలంలో అనేక శతక కర్తలు ప్రసిద్ధికి వచ్చారు. శ్రీ కాళహస్తీశ్వర శతమము, దాశరధి శతకము, సింహాద్రి నారసింహ, ఆంధ్ర నాయక శతకములు జనులకు సుపరిచితాలు. వేమనయోగి శతకమునకు ప్రత్ర్యేక స్థానం ఉంది. తత్వకధనాల్లో పోతులూరి వీర బ్రహ్మంగారి కాలజ్ఞాన వచనాలు మిక్కిలి జనాదరణ పొందినవి.

   ఒక్క వీరబ్రహ్మంగారి రచనలు తప్ప తక్కిన కృతులన్నీ-ప్రబంధాలైనా, శతకాలైనా, వచన రచనలైనా- చాలావరకు పూర్వ వ్యాకరణ మర్యదల్నే పాటీంచాయి.  కొంత మినహాయింపు, ఒకింత స్వాతంత్యంఊ వహించక పోలేదు.  ఈకాలంలో రేఫఱకారములు సాంకర్యం పొందుకు వచ్చాయి.  కారణమేమిటంటె ఉచ్చారణలో వాటి ప్రత్యేక స్వభావం అదృశ్యమయింది.  రేఫద్వయ సాంకర్యం నివారించడానికి పండితులు యత్నించేవారు.   ఈ రెండు రకారాలు ఉన్న శబ్ధాల పట్టికలు తయారు చయ్యడం మొదలు పెట్టారు.  తాళ్ళపాక పెదతిరుమలాచార్యులు, కాకునూరి అప్పకవి, కూచిమంచి తిమ్మకవి వీరికీ సాధ్యంకాలేదు. ప్రాచీన కాలంలో తెలుగు భాషలో ఉండిన 'అ 'ధ్వనిని అవరైనా నిలుపగలిగినారా, అట్టిదే ఈ రకార ద్యయ భిన్నస్థితికూడా, పూర్వ వ్యాకరణానికి అంతగా సమ్మతంకాని రూపాలు ఈ కాలపు కవులు వాడుతూ వచ్చారు.  వీటిని దీజ్మాత్రంగా చేమకూర వెంకటకవి నుండి ఉదాహరింప వచ్చును.  క్త్వార్ధక ఇకారసంధి, "అటు జూపిటు, ఇటు జూపటు" వంటివి.  అనుప్రయుక్తమైన కొను ధాతువునకు 'క ' ఆదేశముగా చేయుట-ఊరుక (ఊదుకొని అనుటకు) కంకంటి పాపరాజుకూడా ఇటువంటి ప్రయోగం చేశాడు.  సుమతీ శతకంలో 'వడి ఎద్దుల గట్టుక, మడి దున్నక బ్రతకవచ్చు '  షష్ఠీకువర్ణము ముందు సగాగము చేయకుండుట - వాదునకు అనుటకు బదులు వాదుకు, అత్వ సంధిచేయడం - తేనెలయంత అనుటకు తేనెలంత. శబ్ధగత ఇమారానికి సంధి చ్వెయ్యడం-బంతిది (బంతి+ఇది), ఇట్టి ప్రయొగాలు ప్రామాణికులుగా భావింపబడే శ్రీనాధుడు, అల్లసాని పెద్దన, నంది తిమ్మన, పింగళి సూరన, రామరాజ భూషణుడు వంటి వారుకూడా చేశారని తాపీ ధర్మారావుగారు వ్రాశారు.  ఈ విశేష ప్రయోగాలు ఎ నాటివి కావు.  ప్రాచీన కాలంనుంచీ వస్తున్నాయి.  శివకవులైన పాల్కురికి సోమనాధుడు మున్నగువారికిని సమ్మతములే.  తెలుగు భాషా ప్రయోగంల్జో రెండు పాయలున్నాయని చెప్పాలి.  అందొకటి నన్నయాదుల మార్గము. సంస్కారయుతమైన భాషనే కావ్యంలో ప్రయోగించాలనే వారు ఒక వర్గము-వ్యవహారే భాషకు సన్నిహిత