పుట:Sahityabashagate022780mbp.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

64

   గప్పినక్రియ, విరిపొట్లము
   విప్పినగతి ముమ్మరంగవిత్వము సభలన్.

ఈ ప్రతిజ్ఞను ఆయన తన కావ్యంలో సముచితంగా నిర్వహించినాడు. అర్ధంకోసం పెనుగులాడనక్క్జరలేకుండా, నిఘంటు ద్యూతులు పరపించనక్కరలేకుండా కవిత్వం లలితమై సరళమై ప్రసన్నమై జాలువరడం మళ్ళీ మొదలు పెట్టింది. ఈ విధ్యలో చేమకూరవెంకటమవి రఘునాధ నాయకుణ్ణి మించిపోయాడు. ఈయన కవిత్రంలో తెలుగు పదాలు చమత్కారంగా విరిగి మనోహరార్ధాలు ప్రసరిస్తాయి. ఇది ఒక విధంగా శ్లేషకవిత్వమే. అయినా ద్వ్యర్ధి కావ్యాల్లో మల్లె భయజనకంకాదు. ఈతనిక్ యమకారి శబ్ధాలంకారాలు అప్రయత్నంగావచ్చి కూర్చుంటాయి. అవి మురిపమైన తెలుగు పదాల్తో కూర్పుపోదుతాయి. "అమ్మక చెల్ల నా హృదయమమ్మకచెల్లదు వీనికి య్యెడన్" 'మనసు భద్రమయ్యె మన సుభద్ర కిపుడు ' వంటివి కోకొల్లలు. 'అయ్యారే చెలువెక్కడ! నయ్యారే గెలువజాలు నంగజూనారిన్" విజ-1-121 ప్రబంధయుగమునందువలెనే ఈ యుగమునందును శృంగరకావ్యమలకే అగ్రతాంబూలము. మొదటి ప్రబంధ కాలంలో ఆముక్తమాల్యదకువలె ఈ యుగంలో రఘునాధుని వాల్మీలొ చరిత్రకు విశిష్టతకలదు.

      మధురనాయక రాజ్యంలో కూడా తంజావూరునందలి సాహిత్యప్రక్రియలే వర్దిల్లాయి.  మధురరాజ్యపు కవుల్లో శృంగారరస సమాశ్రయణంఊ ఓఖా చూపు వాసి విశృంఖలమనే చెప్పాలి. ఇక్కడి విద్వత్కవుల్లో సత్యభామా సాంత్వనము వ్రాసిన లింగనమఖీ కామేశ్వర కవి ప్రముఖుడు.  నిషిద్ధ శృంగారాన్ని ఇచ్చటి కవులు ఆసక్తితోచేపట్టేవారు.   అహల్యాసంక్రందనము, శశాంకవిజయమువంటి కావ్యాలు నీతిలో కొంత లొచ్చైనాతెలుగు భాషా మార్ధచ్వాన్ని పుక్కిట బట్టడంలో మిన్నయైనవి.  వీరందరినీ మించి సుతిమెత్తని  తెలుగునుడికారం పలికించగలిగిన ప్రవీణురాలు ముద్దుపళని.  ఈమె తంజావూరు ఆస్థానమునకు చెందినది.  ఈవిడ రాధికా సాంత్వనము భాషా సౌక్మార్య విషయంలో ప్రశంసలందుకుంది.  రాయలసీమ ప్రాంతంలో సవరము చిననారాయణ నాయకుడు, రామెర్ల వెంగళభూపాలుడు, తెలంగాణంలో సురభి మాదవరాయలు, రాజామల్లారెడ్డి. ఆంధ్రప్రాంతంలో కూచిమంచి తిమ్మకవి సార్వభౌముడు, కంకంటి పాపరాజు మున్నగు ఉత్తమ కవులెందరో వెలిశారు.  వీరంతా సమ సంస్కృతాంధ్రములతో కవిత్వం నదిపినవారే.  సురభిమాధవరాయలు

.